Skip to main content

NEET UG Admit Cards: నీట్ యూజీ అడ్మిట్ కార్డులు విడుద‌ల... అడ్మిన్‌కార్డు కోసం క్లిక్ చేయండి

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ పరీక్షకు గడువు సమీపిస్తోంది. మే 7న (ఆదివారం) జరిగే ఈ పరీక్షకు జాతీయ పరీక్షల సంస్థ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్స్‌ను ఇప్ప‌టికే విడుదల చేసింది. పెన్ను, పేపర్‌ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు/ పట్టణాల్లో జరిగే ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
NEET UG Admit Cards
NEET UG Admit Cards

తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్ష అడ్మిట్‌ కార్డులను ఎన్‌టీఏ తాజాగా విడుద‌ల చేసింది. నీట్‌ పరీక్షను గతేడాది 17.64లక్షల మంది విద్యార్థులు రాయగా.. ఈ ఏడాది దాదాపు 18 లక్షల మంది రాసే అవకాశం ఉంది. 


అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండిలా..

అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి.. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inకి వెళ్లండి.

ఆ తర్వాత హోమ్ పేజీలో ఇచ్చిన NEET UG అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.

తర్వాత అప్లికేషన్ నంబర్ మొదలైన వివరాలను నమోదు చేయండి.

అప్పుడు అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌ని చెక్ చేసుకుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

చివరగా.. అడ్మిట్ కార్డ్‌ను ప్రింట్ తీసుకోండి.

Published date : 04 May 2023 12:24PM

Photo Stories