Skip to main content

Cognizant to lay off: ఉద్యోగుల‌కు షాక్ ఇచ్చిన కాగ్నిజెంట్‌... 3,500 మందిని తొల‌గిస్తూ నిర్ణ‌యం

ఐటీ లేఆఫ్స్ కొన‌సాగుతున్నాయి. దిగ్గ‌జ కంపెనీల‌న్నీ త‌మ ఖ‌ర్చుల‌ను త‌గ్గించే ప‌నిలో ప‌డ్డాయి. కొత్త ప్రాజెక్టుల రాక మంద‌గించ‌డంతో పాటు, ఉన్న ప్రాజెక్టుల‌పై ఆర్థిక భారాన్ని త‌గ్గించుకోవాల‌ని అన్ని కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉద్యోగుల‌ను తొల‌గించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌య్యాయి.
Cognizant to lay off
Cognizant to lay off

చ‌ద‌వండి: సాఫ్ట్‌వేర్ ఉద్యోగంపై ఆందోళ‌న వ‌ద్దు... ఇలా చేస్తే మీ ఉద్యోగం గ్యారంటీ

ఇప్ప‌టికే ఫేస్‌బుక్‌, గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు వేల సంఖ్య‌లో ఉద్యోగుల‌ను తొల‌గించాయి. తాజాగా ఈ జాబితాలోకి ప్ర‌ముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ చేరింది. 2023 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి అనుకున్నంత‌మేర‌కు ఆదాయం రాక‌పోవ‌డంతో కంపెనీపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డింది. దీంతో ఆ మేర‌కు ఉద్యోగుల‌ను తొల‌గించేందుకు కాగ్నిజెంట్ సిద్ధ‌మైంది. 

cognizant

కాగ్నిజెంట్లో సుమారు 3.50 ల‌క్ష‌ల మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు. వీరిలో 1 శాతం అంటే 3,500 మందిపై వేటు వేయ‌నున్నట్లు గురువారం ప్రకటించింది. అలాగే భ‌వ‌నాల‌కు అద్దెలు కూడా త‌గ్గించుకునే ప‌నిలో కంపెనీ ఉంది. ఆపరేటింగ్ మోడల్‌ను సరళతరం చేయడం, కార్పొరేట్ విధులను ఆప్టిమైజ్ చేయడం.. హైబ్రిడ్ పని వాతావరణానికి అనుగుణంగా కార్యాల‌య స్థ‌లాన్ని త‌గ్గించుకోవ‌డం, పున‌ర్నిర్మించ‌డం లక్ష్యంగా నెస్ట్ జెన్‌ (NextGen) కార్యక్రమాన్ని ప్రారంభించింది.

చ‌ద‌వండి: అమెజాన్ ఉద్యోగులు విల‌విల‌... తాజాగా హాలో యాప్ పూర్తిగా నిలిపివేత

cognizant

ఈ ఏడాది మొదటి త్రైమాసికం ముగిసే నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,51,500గా న‌మోదైంది. అంతకుముందు 2022 త్రైమాసికంతో పోలిస్తే 3,800 మంది ఉద్యోగులు త‌గ్గార‌ని కంపెనీ తెలిపింది. అయితే 2023 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో కాగ్నిజెంట్ నికర లాభం 3 శాతం పెరిగి 580 మిలియన్ డాలర్లకు చేరింది. అలాగే 2023 క్యూ1లో కంపెనీ ఆదాయం 0.3 శాతం క్షీణించి 4.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

Published date : 04 May 2023 03:12PM

Photo Stories