Software Company Layoffs: భారీగా ఉద్యోగులను తొలగించిన సాఫ్ట్‌వేర్ కంపెనీ
యూఎస్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘యూకేజీ’ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. ఓ నివేదిక ప్రకారం కంపెనీ తన తాజా రౌండ్‌లో మొత్తం శ్రామికశక్తిలో దాదాపు 14% మందికి ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఈ లేఆఫ్‌లతో 2,200 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయినట్లు అంచానా వేస్తున్నారు.
జూలై 4న సెలవు రోజు కావడంతో జూలై 3వ తేదీనే తొలగింపులు ప్రారంభించినట్లు చెబుతున్నారు. యూకేజీ లేఆఫ్‌ల గురించి బిజినెస్ జర్నల్ నివేదించింది. ఫ్లోరిడాకు చెందిన ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ భారీ లేఆఫ్‌లతో తన శ్రామిక శక్తిని ఎలా తగ్గించుకుందో వివరించింది. కంపెనీ సీఈవో క్రిస్ టాడ్ ఈమెయిల్ ప్రకారం కంపెనీ తన వర్క్‌ఫోర్స్‌లో 14% మందిని తగ్గించిందని నివేదిక పేర్కొంది.
CBSE CTET Admit Card 2024: సీటెట్ హాల్‌టికెట్స్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
అనేక దేశాలలో ఉనికిని కలిగి ఉన్న అతిపెద్ద సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లలో ఒకటైన యూకేజీ మొత్తం 15,882 మంది ఉద్యోగులను కలిగి ఉందని పేర్కొంది. కీలకమైన వృద్ధి రంగాలపై దృష్టి సారించడం, దీర్ఘకాలిక వ్యూహం లక్ష్యంగా చేస్తున్న సంస్థాగత మార్పుల్లో భాగంగా తొలగింపులను ప్రారంభించినట్లు యూకేజీ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.
కంపెనీ సీఈవో క్రిస్ టాడ్ తొలగింపులను వచ్చే వారం ప్రకటించాలనుకున్నారు. అయితే ఇంతలోపే వార్తలు బయటకు రావడంతో కంపెనీ తన చర్యలను వేగవంతం చేయాల్సి వచ్చిందంటున్నారు. ప్రస్తుత ఉద్యోగాల కోతలు యునైటెడ్ స్టేట్స్‌కే పరిమితం అవుతాయని క్రిస్ టాడ్ ధ్రువీకరించారు.