Skip to main content

NTPC Jobs: డిప్లొమా అర్హ‌త‌తో ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు... పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి

ఝూర్ఖండ్‌లోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసింది. రెండు ద‌శ‌ల్లో అభ్యర్థులను ఎంపిక చేయ‌నున్నారు. స్టేజ్‌-1లో రాత పరీక్ష, స్టేజ్‌-2లో స్కిల్‌ టెస్ట్‌ ఉంటాయి.
NTPC Jobs
NTPC Jobs

మొత్తం ఖాళీలు: 152
మైన్‌ ఓవర్‌మ్యాన్‌-84, 
ఓవర్‌మ్యాన్‌ (మ్యాగజైన్‌)-7, 
మెకానికల్‌ సూపర్‌వైజర్‌-22, 

చ‌ద‌వండి: ఐటీఐ, డిప్లొమా అర్హ‌త‌తో ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగం.. పూర్తి వివ‌రాలు ఇవే
ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌-20, 
ఒకేషనల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌-3, 
మైన్‌సర్వే-9, 
మైనింగ్‌ సర్దార్‌-7 పోస్టులు. 

అన్ని పోస్టుల‌కు 60 శాతం మార్కులు త‌ప్ప‌నిస‌రి. అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పోస్టులను బ‌ట్టి అనుభ‌వం కూడా ఉండాలి. 
 
అభ్యర్థుల వయసు దరఖాస్తు చివరితేదీ 05.05.2023 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు. రిజ‌ర్వేష‌న్ ఉన్న అభ్య‌ర్థులకు వ‌య‌సులో సడ‌లింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు - రూ.300 చెల్లించాలి.

ntpc

ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

రాత పరీక్ష: మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 40 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు 30 శాతం సాధించాలి. రాత పరీక్షలో ప్రతిభ క‌న‌బ‌ర్చిన అభ్యర్థులను స్కిల్‌ టెస్ట్‌కు ఎంపికచేస్తారు. 

చ‌ద‌వండి: ప‌ది, ఐటీఐ అర్హ‌త‌తో శ్రీహ‌రికోట‌లో ఉద్యోగాలు.. వేత‌నం 45 వేలు...

స్కిల్‌ టెస్ట్‌: దీన్ని 100 మార్కులకు నిర్వహిస్తారు. సంబంధిత విభాగానికి సంబంధించిన ప్రశ్నలుంటాయి. దీంట్లో జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 40 శాతం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు 30 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి.  

ఎంపికైన అభ్యర్థులను ఎన్‌టీపీసీకి చెందిన ఝూర్ఖండ్, చత్తీస్‌గఢ్, ఒడిశాల్లోని కోల్‌ మైనింగ్‌ ప్రాజెక్టుల్లో ఎక్కడైనా నియమించవచ్చు.  

దరఖాస్తుకు చివరి తేదీ: 05.05.2023   

వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in/

Published date : 04 May 2023 01:44PM
PDF

Photo Stories