Skip to main content

NTPC Jobs 2023 : రూ.1,40,000 జీతంతో.. ఎన్‌టీపీసీలో 495 ఉద్యోగాలు.. అర్హ‌తలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC)లో 495 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Central Government Job Opportunity, Apply Online for NTPC Jobs, ntpc jobs telugu news,495 Executive Trainee Vacancies, Career Opportunity
ntpc jobs 2023

ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు.. గేట్-2023 అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.ఎంపికైన అభ్యర్థులు వేర్వేరు చోట్ల ఏడాది పాటు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక పోస్టింగ్‌ ఇస్తారు. దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.

ఫీజు : సరైన అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

వయోపరిమితి: 
20.10.2023 నాటికి 27 సంవత్సరాలలోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ద‌ర‌ఖాస్తు వివ‌రాలు :
ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ విధానం అక్టోబరు 6వ తేదీ నుంచి అక్టోబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

జీతం : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు జీతంగా పొందొచ్చు. 

పోస్టుల వివ‌రాలు ఇవే..
☛ ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీలు : 495
☛ ఎలక్ట్రికల్ : 120
☛ మెకానికల్ : 200
☛ ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ : 80
☛ సివిల్ : 30
☛ మైనింగ్ : 65

అర్హ‌త‌లు ఇవే..
ఈ పోస్టుల‌కు సంబంధిత విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు.. గేట్-2023 అర్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

ఎంపిక విధానం : 
అకడమిక్ మార్కులు, గేట్-2023 స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు.

పూర్తి వివ‌రాలు ఇవే...

Published date : 11 Oct 2023 08:58AM
PDF

Photo Stories