Skip to main content

Jagananna Videshi Vidya Deevena: విదేశీ విద్యా దీవెన కింద రూ.కోటికి పైగా ఆర్థిక సాయం... ఇలా అప్లై చేసుకోండి

ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల విదేశీ చదువుల కలను సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సాకారం చేస్తోంది. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని యువత ఉన్నత విద్యా కలలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. విదేశాలకు వెళ్లి చదువుకునే అర్హులైన విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజును పూర్తిగా ప్రభుత్వమే చెల్లించనుంది.
విదేశీ విద్యా దీవెన కింద రూ.కోటికి పైగా ఆర్థిక సాయం
విదేశీ విద్యా దీవెన కింద రూ.కోటికి పైగా ఆర్థిక సాయం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25కోట్లు, ఇతరులకు రూ.కోటి వరకు మంజూరు చేయనుంది. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి జిల్లా నోడల్‌ అధికారులుగా సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు.

50 ప్రముఖ వర్సిటీల్లో అవకాశం..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూషన్లలో లేటెస్ట్‌ క్యూఎస్‌ రేటింగ్‌ ఆధారంగా టాప్‌ 50లో నిలిచిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూషన్లలో చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, కాపు వర్గాలకు చెందిన పేద విద్యార్థులు పీజీ లేదా పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ కోర్సులు చదువుకునేందుకు ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటునందిస్తోంది. 

జ‌గ‌న‌న్న విదేశీ విద్యాదీవ‌న ప‌థ‌కం పూర్తి వివ‌రాలు ఇవే...... ఇలా అప్లై చేసుకోండి

vidya deevena

ఆయా కోర్సులకు సంబంధించిన అవసరమైన విద్యార్హతల్లో కచ్చితంగా 60 శాతం మార్కులు పొందిన వారినే పరిగణనలోకి తీసుకుంటోంది. ఎంబీబీఎస్‌ అభ్యసించేందుకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్‌ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు హెచ్‌టీటీపీ://జ్ఞానభూమి.ఏపీ.జీవోవీ.ఇన్‌ అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

H-1B visa holders: H-1B వీసాదారులకు గుడ్‌న్యూస్‌... కెన‌డా ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యం ఇదే..!

ఈ కోర్సుల్లో చాన్స్‌..

అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫారెస్ట్రీ, ఆర్కిటెక్చర్‌ అండ్‌ బిల్డ్‌ ఎన్విరాన్‌మెంట్‌, ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌, ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌, బయోలాజికల్‌ సైన్స్‌, బిజినెస్‌, కెమిస్ట్రీ, కమ్యూనికేషన్‌ అండ్‌ మీడియా స్ట్రాటజీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌ అండ్‌ ఎకనామోట్రిక్స్‌, ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఇంజినీరింగ్‌ ఇన్‌ మినరల్స్‌ అండ్‌ మైనింగ్‌, ఇంజినీరింగ్‌– పెట్రోలియం, హాస్పిటిలాలిటీ అండ్‌ లీజర్‌ మేనేజ్‌మెంట్‌, లా, మెడిసిన్‌, నేచురల్‌ సైన్స్‌, ఫిజిక్స్‌ అండ్‌ ఆస్ట్రానమీ.

vidya deevena

కోటికిపైగా సాయం...
అర్హులైన విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం కోటికి పైగా సాయమందించనుంది. గత ఏడాది కాపు, మైనార్టీ తదితర వర్గాలకు సంబంధించి కోటి 25 లక్షల వరకూ మంజూరు చేసింది. దాంతో ఆయా వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. పేద విద్యార్థులు ప్రతిభ కలిగి, ఆర్థిక వెనుకబాటుతో విదేశీ విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది.

NMC: వైద్య విద్యార్థుల‌కు కీల‌క అప్డేట్‌... ఈ ఎగ్జామ్ పూర్తి చేసిన‌వారికే లైసెన్స్‌

జూన్‌ 30 వరకు గడువు..
విదేశీ విద్యాదీవెనకు అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. తొలుత ఈ నెల 10వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆయా వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆ గడువును ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించారు. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8లక్షలకు మించకుండా 35 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

vidya deevena

ఎవ‌రు అర్హులంటే... 
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్‌ విద్యా సంస్థల్లో సీటు సంపాదించి ఆర్థికంగా వెనుకబాటును ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఈ పథకం వరం. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ వార్షికాదాయం ఎనిమిది లక్షల లోపు ఉండి, 35 ఏళ్ల లోపు విద్యార్థులు ఈ పథకానికి అర్హులు.

Published date : 28 Jun 2023 06:45PM

Photo Stories