Collector L Sivashankar: విద్యా పథకాలతో పేదల కలలు సాకారం
డిసెంబర్ 20న ఈ రెండు పథకాలకు సంబంధించిన నిధులను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్ నుంచి జెడ్పీ చైర్‌పర్సన్ హెనీక్రిస్టినా, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి కలెక్టర్ వీక్షించారు.
అనంతరం కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు పేదల జీవితాలకు వరంలా మారాయన్నారు. అనంతరం లబ్ధిదారులకు నమూనా చెక్కులు అందించారు. కార్యక్రమంలో పౌడా చైర్మన్ మిట్టపల్లి రమేష్, ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ స్వామి మాస్టర్, జెడ్పీటీసీ సభ్యులు పదముత్తం చిట్టిబాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
చదవండి: Adolescent Education: కౌమార విద్యపై అవగాహన కల్పించండి
జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా 20 మందికి లబ్ధి
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా 20 మంది విద్యార్థులకు రూ.1,57,74,981 ఆర్థిక లబ్ధి చేకూరింది. వీరిలో ఎస్సీలు, బీసీలు, కాపులు, ముస్లిం మైనార్టీలు ముగ్గురు చొప్పున ఉండగా, ఈబీసీలు ఏడుగురు, క్రిస్టియన్ మైనార్టీ ఒకరు ఉన్నారు. జిల్లాలో సివిల్స్ సర్వీసెస్‌కు ఎంపికై న వారు నలుగురు, మెయిన్‌కు క్వాలిఫై అయిన వారు ఒకరు ఉండడంతో వారందరికీ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాన్ని అందించారు. మొత్తం ఐదుగురికి రూ.5.5 లక్షల లబ్ధి చేకూరింది.