Adolescent Education: కౌమార విద్యపై అవగాహన కల్పించండి
యడ్లపాడు: కౌమారవిద్యపై సమగ్ర అవగాహన బాలికలకు రీసోర్సు పర్సన్లు అవగాహన కల్పించాలని డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్‌ఎం సుభాని తెలిపారు. గుంటూరు, తెనాలి, బాపట్ల విద్యాశాఖ డివిజన్లలోని 67 ఉన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఈ శిక్షణకు హాజరయ్యారు. ఉన్నత పాఠశాలల్లో అభ్యసించే బాలికలకు కౌమారదశలో వచ్చే మార్పుల గురించి అవగాహన కల్పించుకోవాలని కోరారు. శిక్షణ తరగతులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కౌమారదశలో పునరోత్పత్తి మార్గ అంటువ్యాధులు, లైంగిక పరంగా సంక్రమించే వ్యాధులు, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ తదితర వ్యాధులు అవగాహన లోపంతో వస్తాయన్నారు. వాటి లక్షణాలు గుర్తించడం, అపొహలు తొలగించుకోవడం ఎంతో అవసరం అన్నారు. శిక్షణ తీసుకున్న రీసోర్సు పర్సన్లు తమ పాఠశాల్లో బాలికలకు కౌమర దశ విద్యపై బోధించాల్సి ఉంటుందని చెప్పారు. అనంతరం డైట్ కళాశాల ఉపన్యాసకులు శిక్షణ తరగతులు కొనసాగాయి. కార్యక్రమంలో డాక్టర్ కె.ప్రసాద్, కె.యోగేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ సుభాని జిల్లాస్థాయి రీసోర్స్ పర్సన్‌లకు శిక్షణ తరగతులు జిల్లా విద్యశిక్షణ సంస్థలో 67 ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు హాజరు