CEOs of American Firms: ప్రధాని మోదీ భేటీ అయిన క్వాల్‌కామ్ సీఈవో పేరు?
అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయిదు రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 23న వాషింగ్టన్‌లో జరిగిన ఈ సమావేశంలో భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. భారత్‌లో వ్యాపార అవకాశాల గురించి వివరించారు. చిప్ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్ సీఈవో క్రిస్టియానో ఇ అమోన్, సౌర విద్యుత్ సంస్థ ఫస్ట్ సోలార్ చీఫ్ మార్క్ విడ్మర్, ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం బ్లాక్‌స్టోన్ చైర్మన్ స్టీఫెన్ ఎ ష్వార్జ్‌మాన్, అడోబ్ చైర్మన్ శంతను నారాయణ్, జనరల్ అటామిక్స్ సీఈవో వివేక్ లాల్‌తో ప్రధాని భేటీ అయ్యారు.
దోతి శతాబ్ది వేడుక...
రామ్‌రాజ్æ కాటన్ ఆధ్వర్యంలో ‘ధోతి 100’ పేరుతో తమిళనాడులోని తిరుప్పూర్‌లో ధోతి శతాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నారు. దోతిని తన వస్త్రాధరణగా మార్చుకున్న మహాత్మా గాంధీ శతవార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ వేడుకను జరుపుతున్నారు. ఈ సందర్భంగా 100 మంది అమరవీరుల కుటుంబాలను, 100 మంది నేత కార్మికులను సత్కరించనున్నారు. 100 మొక్కలు నాటనున్నారు.
చదవండి: కేంద్ర ఆవిష్కరించిన సింగిల్ విండో పోర్టల్ ఉద్దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అయిదు రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల సీఈవోలతో సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : భారత్‌లో వ్యాపార అవకాశాల గురించి వివరించేందుకు...