Skip to main content

Entertainment, Media Industry: 2026 నాటికి రూ. 4.30 లక్షల కోట్లకు దేశీ మీడియా

Indian Media, Entertainment Industry Likely To Touch Rs 4.30 Lakh Crore By 2026
Indian Media, Entertainment Industry Likely To Touch Rs 4.30 Lakh Crore By 2026

దేశీ మీడియా, వినోద పరిశ్రమ 2026 నాటికి 8.8 శాతం మేర వార్షికంగా వృద్ధి చెందనుంది. రూ. 4.30 లక్షల కోట్లకు చేరనుంది. దేశీ మార్కెట్లో ఇంటర్నెట్, మొబైల్స్‌ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్‌ మీడియా, ప్రకటనలు ఇందుకు ఊతమివ్వనున్నాయి. సంప్రదాయ మీడియా నిలకడగా వృద్ధి చెందనుంది. అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం 2026 నాటికి టీవీ అడ్వర్టైజింగ్ రూ.43,000 కోట్లకు చేరనుంది. తద్వారా అంతర్జాతీయంగా ఈ విషయంలో అమెరికా, జపాన్, చైనా, బ్రిటన్‌ తర్వాత అతి పెద్ద టీవీ అడ్వర్టైజింగ్‌ మార్కెట్‌గా భారత్‌ అయిదో స్థానం దక్కించుకోనుంది. 2022లో భారతీయ మీడియా, వినోద పరిశ్రమ 11.4 శాతం వృద్ధితో రూ. 3.14 లక్షల కోట్లకు చేరనుంది.  

Also read: Adani group: సమాజ సేవకు అదానీ రూ. 60 వేల కోట్ల విరాళం

ఓటీటీలకు సబ్‌స్క్రిప్షన్‌ ఊతం .. 
దేశీయంగా ఓటీటీ వీడియో సర్వీసులు వచ్చే నాలుగేళ్లలో రూ. 21,031 కోట్లకు చేరవచ్చని అంచనా. ఇందులో రూ. 19,973 కోట్లు సబ్‌స్క్రిప్షన్‌ ఆధారిత సర్వీసుల నుండి, రూ. 1,058 కోట్లు వీడియో ఆన్‌ డిమాండ్‌ (వీవోడీ) విభాగం నుండి రానున్నాయి. ఓటీటీల వృద్ధికి సబ్ స్క్రిప్షన్ సర్వీసులు ఊతమిస్తున్నాయని, 2021లో ఓటీటీల మొత్తం ఆదాయంలో వీటి వాటా 90.5 శాతంగా ఉండగా .. 2026 నాటికి 95 శాతానికి చేరుతుందని నివేదిక తెలిపింది. జనాభా పరిమాణం, మొబైల్‌ ఆధారిత ఇంటర్నెట్‌ వీడియోల వినియోగం.. ఓటీటీ మార్కెట్‌ వేగవంతంగా వృద్ధి చెందడానికి దోహదపడనున్నాయి.  

Also read: Commercial Projects: ఢిల్లీలో నూతన వాణిజ్య భవన్‌ ప్రారంభం

వార్తాపత్రికలు అప్‌..: 
2021లో మొత్తం వార్తాపత్రికల ఆదాయం రూ. 26,378 కోట్లుగా ఉండగా, 2026 నాటికి 2.7 శాతం వార్షిక వృద్ధి రేటుతో (సీఏజీఆర్‌) రూ. 29,945 కోట్లకు చేరనుంది. అప్పటికల్లా భారత న్యూస్‌పేపర్‌ మార్కెట్‌ .. ఫ్రాన్స్, బ్రిటన్‌ను కూడా దాటేసి అయిదో స్థానానికి ఎదుగుతుంది. ఈ వ్యవధిలో దినపత్రికల కాపీల విక్రయాల్లో (పరిమాణంపరంగా) వృద్ధి నమోదు చేసే ఏకైక దేశంగా భారత్‌ నిలవనుంది. ప్రింట్‌ ఎడిషన్‌ రీడర్ షిప్ లో 2025 నాటికి చైనాను దాటేసి అతి పెద్ద మార్కెట్‌గా నిలవనుంది. 

Also read: Quiz of The Day (June 24, 2022): మన దేశంలో ఉన్న ఏకైక క్రియాశీలక అగ్ని పర్వతం ఏది?

Published date : 24 Jun 2022 06:04PM

Photo Stories