India GDP Growth Rate: ఏడీబీ అంచనాల ప్రకారం.. 2022–23లో భారత్ వృద్ధి రేటు?
భారత్ ఆర్థిక వృద్ధి రేటు 2022–23లో 7.5 శాతంగా నమోదవుతుందని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. 2023–24లో ఈ రేటు 8 శాతానికి పెరుగుతుందని విశ్లేషించింది. ఈ మేరకు ఏప్రిల్ 6న ఆసియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ (ఏడీఓ)ను విడుదల చేసింది.
Ministry of Finance: స్టాండప్ ఇండియా స్కీమ్ ప్రధాన ఉద్దేశం?
ఏడీఓలోని ముఖ్యాంశాలు..
- భారత్ చక్కటి వృద్ధి తీరుతో 2022లో దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థల వృద్ధి ఏడు శాతం ఉంటుందని అంచనా. 2023లో ఈ రేటు 7.4 శాతానికి పెరుగుతుంది.
- పాకిస్తాన్ వృద్ధి రేటు 2022లో మధ్యస్థంగా 4 శాతంగా ఉంటుంది. 2023లో ఇది 4.5 శాతానికి చేరుతుంది.
- ఆసియాలోని పలు ఎకానమీల్లో 2022, 2023ల్లో దేశీయ డిమాండ్, రికవరీ మెరుగుపడుతుంది. అయితే ఎకానమీలకు కొన్ని సవాళ్లూ ఉన్నాయి.
- ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, కరోనా కొత్త వేరియంట్ భయాలు, అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు వంటి సవాళ్లను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది.
Financial Year 2021-22: భారత్ వాణిజ్య లోటు ఎన్ని బిలియన్ డాలర్లు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ ఆర్థిక వృద్ధి రేటు 2022–23లో 7.5 శాతంగా నమోదవుతుంది
ఎప్పుడు : ఏప్రిల్ 06
ఎవరు : ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్