Financial Year 2021-22: భారత్ వాణిజ్య లోటు ఎన్ని బిలియన్ డాలర్లు?
ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్య లోటు 2021–22 ఆర్థిక సంవత్సరం ఆందోళనకర స్థాయిలో నమోదైంది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చిచూస్తే, ఏకంగా 88 శాతం పెరిగి 102.63 బిలియన్ డాలర్ల నుంచి 192.41 బిలియన్ డాలర్లకు చేరింది. భారతదేశంలోకి వచ్చే మొత్తం విదేశీ మారకద్రవ్యం–దేశం నుంచి వెళ్లే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాస గణాంకాలను ప్రతిబింబించే కరెంట్ అకౌంట్‌లో తీవ్ర లోటుకు (క్యాడ్) దారితీసే అంశమిది. భారత్ విదేశీ వాణిజ్యానికి సంబంధించి ఏప్రిల్ 4న విడుదలైన గణాంకాలను పరిశీలిస్తే..
- మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల విలువ 417.81 బిలియన్ డాలర్లు. దిగుమతులు 610.22 బిలియన్ డాలర్లు. వెరసి వాణిజ్యలోటు 192.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
- 2021–22 ఆర్థిక సంవత్సరం ఎగుమతులు 28.55 శాతం పెరిగితే, దిగుమతులు 55 శాతం (394.44 బిలియన్ డాలర్ల నుంచి 610.22 బిలియన్ డాలర్లకు) ఎగశాయి. వాణిజ్యలోటు పెరుగుదల ఇదే కాలంలో 88 శాతంగా ఉంది.
Indian Oil Corporation: ఐవోసీతో ఒప్పందం చేసుకున్న సంస్థలు?
HDFC-HDFC Bank Merger: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కలవనున్న అతిపెద్ద గృహ రుణ కంపెనీ?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్