Indian Oil Corporation: ఐవోసీతో ఒప్పందం చేసుకున్న సంస్థలు?
ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), ఇంజనీరింగ్, మౌలిక రంగ దిగ్గజం ఎల్‌అండ్‌టీ, పునరుత్పాదక ఇంధన రంగంలోని రెన్యూ పవర్.. గ్రీన్ హైడ్రోజన్ తయారీకి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ మేరకు సంయుక్తంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల అభివృద్ధికి గాను ఒప్పందంపై ఈ మూడు సంస్థలు సంతకాలు చేశాయి. ఐవోసీ–ఎల్‌అండ్‌టీ–రెన్యూపవర్.. ఐవోసీకి చెందిన మధుర, పానిపట్ రిఫైనరీల వద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టి సారిస్తాయని సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో ఆ సంస్థలు పేర్కొన్నాయి.
HDFC-HDFC Bank Merger: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కలవనున్న అతిపెద్ద గృహ రుణ కంపెనీ?
మరోవైపు ఐవోసీ, ఎల్‌అండ్‌టీ విడిగా మరో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. దీని ద్వారా అవి గ్రీన్ హైడ్రోజన్ తయారీకి అవసరమైన ఎలక్ట్రోలైజర్లను తయారు చేయనున్నాయి.
టెస్లా వ్యవస్థాపకుడు ఎవరు?
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ 9.2 శాతం వాటాలు కొనుగోలు చేశారు. తద్వారా సంస్థలో అతి పెద్ద వాటాదారుగా మారారు. మార్చి 14న మస్క్ 7.35 కోట్ల షేర్లను దక్కించుకున్నట్లు ఏప్రిల్ 4న వెల్లడైంది.
Lok Sabha: అకౌంటెన్సీ వ్యవస్థ పునర్‌వ్యవస్థీకరించే బిల్లుకు ఆమోదం
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ)తో ఒప్పందం చేసుకున్న సంస్థలు?
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : ఎల్‌అండ్‌టీ, రెన్యూ పవర్
ఎందుకు : గ్రీన్ హైడ్రోజన్ తయారీకి జాయింట్ వెంచర్ ఏర్పాటు కోసం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్