Ministry of Finance: స్టాండప్ ఇండియా స్కీమ్ ప్రధాన ఉద్దేశం?
![Stand Up India](/sites/default/files/images/2022/04/06/stand-india-1649232480.jpg)
క్షేత్ర స్థాయిలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు, మహిళా వ్యాపారవేత్తలకు ఆర్థిక సాధికారత, ఉపాధి కల్పన కోసం ఉద్దేశించిన ‘‘స్టాండప్ ఇండియా స్కీమ్’’ కింద గత ఆరేళ్లలో రూ. 30,160 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. ఇప్పటిదాకా 1,33,995 ఖాతాదారులకు ఈ లోన్‌లు ఇచ్చినట్లు పథకం ప్రారంభించి ఆరేళ్లయిన సందర్భంగా ఏప్రిల్ 6న కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 1 లక్ష మందిపైగా మహిళా ప్రమోటర్లు ఈ స్కీముతో ప్రయోజనం పొందినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్‌టీ వర్గాలు, మహిళలు రూ. 10 లక్షల నుండి రూ. 1 కోటి వరకూ బ్యాంక్ రుణాలు పొందేందుకు స్టాండప్ ఇండియా స్కీమ్ ఉపయోగపడుతుంది. 2016, ఏప్రిల్ 5న ఈ పథకాన్ని ప్రారంభించారు.
Financial Year 2021-22: భారత్ వాణిజ్య లోటు ఎన్ని బిలియన్ డాలర్లు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘‘స్టాండప్ ఇండియా స్కీమ్’’ కింద గత ఆరేళ్లలో రూ. 30,160 కోట్ల రుణాలు మంజూరయ్యాయి
ఎప్పుడు : ఏప్రిల్ 05
ఎవరు : కేంద్ర ఆర్థిక శాఖ
ఎక్కడ : దేశ వ్యాప్తంగా..
ఎందుకు : క్షేత్ర స్థాయిలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు, మహిళా వ్యాపారవేత్తలకు ఆర్థిక సాధికారత, ఉపాధి కల్పన కోసం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్