Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, డిసెంబ‌ర్ 5th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu December 5th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
December 5th current affairs

Eco Oscar: తెలంగాణ స్టార్టప్‌కు ఎకో ఆస్కార్‌
పర్యావరణ ఆస్కార్‌గా పేరొందిన ప్రతిష్టాత్మక ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ తెలంగాణలో ఏర్పాటైన అంకుర సంస్థ ‘ఖేతి’కి దక్కింది. పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటూ సన్నకారు రైతుల సాగు ఖర్చును తగ్గించి, దిగుబడి, ఆదాయం పెంచుకునేందుకు ఈ సంస్థ సాయమందిస్తోంది. అందుకు గాను ‘ప్రొటెక్ట్, రీస్టోర్‌ నేచర్‌’ విభాగంగా ఈ అవార్డును అందుకుంది. పురస్కారంతో పాటు పది లక్షల పౌండ్ల బహుమతి సొంతం చేసుకుంది. ఖేతి అనుసరిస్తున్న ‘గ్రీన్‌హౌజ్‌ ఇన్‌ ఏ బాక్స్‌’ విధానానికి ఈ అవార్డ్‌ను ఇస్తున్నట్లు ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ వ్యవస్థాపకుడు, బ్రిటన్‌ యువరాజు విలియం వ్యాఖ్యానించారు. న‌వంబ‌ర్ 2వ తేదీ అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన కార్యక్రమంలో ఖేతి సహ వ్యవస్థాపకుడు, సీఈఓ కప్పగంతుల కౌశిక్‌ పురస్కారం అందుకున్నారు. ‘‘మా పద్ధతిలో రసాయ నాల వాడకమూ అతి తక్కువగా ఉంటుంది. పంటకు నీటి అవసరం ఏకంగా 98% తగ్గుతుంది! దిగుబడి ఏకంగా ఏడు రెట్లు అధికంగా వస్తుంది. ‘గ్రీన్‌హౌజ్‌’ కంటే ఇందులో ఖర్చు 90 శాతం తక్కువ. రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. మళ్లీ పంట సాగుకు, పిల్లల చదువు తదితరాలకు వాడుకోవచ్చు.’’ అని ఆయన వివరించారు.

National Sports Awards: జాతీయ క్రీడా పురస్కారాలు ప్రదానం

Glacier Breaks Down: అంటార్కిటికాలో విరిగిపడ్డ హిమానీనదం
గ్లోబల్ వార్మింగ్‌ తాలూకు ప్రమాద ఘంటికలు నానాటికీ తీవ్రస్థాయికి పెరుగుతున్నాయి. మంచు ఖండం అంటార్కిటికాలో వేడి దెబ్బకు విలియం అనే భారీ హిమానీ నదం వేలాది ముక్కలుగా విడిపోయింది. దాంతో మొత్తంగా 10 ఫుట్‌బాల్‌ మైదానాలంత పరిమాణంలో మంచు పలకలు విరిగిపడ్డాయి. ఆ ధాటికి సముద్రపు లోతుల్లో ఏకంగా సునామీ చెలరేగింది. ఆ సమయంలో యాదృచ్ఛికంగా అక్కడున్న బ్రిటిష్‌ అంటార్కిటిక్‌ సర్వే నౌక ఆర్‌ఆర్‌ఎస్‌ జేమ్స్‌ క్లార్క్‌ రాస్‌కు చెందిన పరిశోధకులు దీన్ని కళ్లారా చూసి వీడియో తీయ‌డంతో వైరల్‌గా మారింది. ఈ హిమానీ నదం ముందుభాగం సముద్ర మట్టానికి ఏకంగా 40 మీటర్ల ఎత్తుంటుంది. అది విసురుగా విడిపోవడంతో 78 వేల చదరపు మీటర్ల పరిమాణంలో మంచు సముద్రంలోకి చెల్లాచెదురుగా కొట్టుకుపోయింది. ఆ దెబ్బకు సముద్రంలో లోలోతుల దాకా నీరు గోరువెచ్చగా మారిపోయిందట. అప్పటిదాకా 50 నుంచి 100 మీటర్ల లోతు దాకా చల్లని నీరు, ఆ దిగువన గోరువెచ్చని నీటి పొర ఉండేదట. ‘‘హిమానీ నదాలు ఇలా విరిగిపడటం వల్ల సముద్రపు ఉపరితలాల్లో పెను అలలు రావడం పరిపాటి. కానీ అవి అంతర్గత సునామీకీ దారి తీయడం ఆసక్తికరం. ఇలాంటి సునామీలు సముద్ర ఉష్ణోగ్రతలు, అందులోని జీవ వ్యవస్థ తదితరాలపై పెను ప్రభావం చూపుతాయి. లోతుగా పరిశోధన జరగాల్సిన అంశమిది’’ అని సైంటిస్టులు చెప్పుకొచ్చారు. ఈ పరిశోధన ఫలితాలను జర్నల్‌ సైన్స్‌ అడ్వాన్సెస్‌లో ప్రచురించారు. 

G20 summit: జీ-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్

Animal Eyes: ఉక్రెయిన్‌ ఎంబసీలకు ‘జంతువుల కళ్ల’ పార్శిళ్లు 
వివిధ దేశాల్లోని తమ రాయబార కార్యాలయాలకు లెటర్‌ బాంబులు, ఉత్తుత్తి లెటర్‌ బాంబులు, ఆవు, పంది కళ్లతో కూడిన పార్శిళ్లు అందినట్లు ఉక్రెయిన్‌ ప్రభుత్వం తెలిపింది. స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లోని ఉక్రెయిన్‌ ఎంబసీకి నవంబర్‌ 3వ తేదీ జంతువుల కళ్లతో కూడిన పార్శిల్‌ అందింది. ప్రత్యేకమైన రంగు, వాసనతో కూడిన ద్రవంలో ముంచిన ఇటువంటి ప్యాకేజీలు హంగరీ, నెదర్లాండ్స్, పోలండ్, క్రొయేషియా, ఇటలీ తదితర ప్రాంతాల్లోని 17 ఎంబసీలకు అందాయని ఉక్రెయిన్‌ పేర్కొంది. అదేవిధంగా, వాటికన్‌ సిటీలోని ఉక్రెయిన్‌ రాయబారి నివాసంపై దాడి జరిగింది. కజకిస్తాన్‌ ఎంబసీకి బాంబు బెదిరింపు వచి్చంది. దాంతో ఎంబసీలు, కాన్సులేట్ల వద్ద భద్రత మరింత పెంచాలని ఉక్రెయిన్‌ ఆదేశించింది. గత వారం స్పెయిన్‌ ప్రధాని సాంచెజ్‌తోపాటు మాడ్రిడ్‌లోని ఉక్రెయిన్, అమెరికా దౌత్య కార్యాలయాలకు లెటర్‌ బాంబులు అందాయి.

World Boxing Championships: బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భార‌త్‌కు 11 పతకాలు

Sundar Pichai: సుందర్‌ పిచాయ్‌కి పద్మభూషణ్‌ పురస్కారం ప్ర‌దానం 
స్వదేశం భారత్‌ తనలో అంతర్భాగమని గూగుల్, ఆల్ఫాబెట్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ వ్యాఖ్యానించారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు పద్మభూషణ్‌ పురస్కారాన్ని అమెరికాలో భారత రాయబారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధు ప్రదానంచేశారు. ఈ సందర్భంగా పిచాయ్‌ భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. 

Ruturaj Gaikwad:ఒకే ఓవర్లో 7 సిక్సర్లు.. రికార్డు బద్దలు..
‘‘అత్యంత గౌరవప్రద పురస్కారానికి నన్ను ఎంపిక చేసినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఇందుకు భారత ప్రభుత్వానికి, భారతీయులకు సదా రుణపడి ఉంటా. నన్నింతవాడిని చేసిన దేశమే మళ్లీ నన్నిలా గౌరవించింది. తద్వారా నా కృషికి సంపూర్ణతను తెచ్చింది. భారతదేశం ఎల్లప్పుడూ నాలోనే ఉంటుంది. నా మాతృదేశం నాలో అంతర్భాగం. భారతీయతను శాశ్వతంగా కొనసాగిస్తా. ఇంతటి అమూల్యమైన అవార్డును బయటెక్కడా దాచుకోను. ఎక్కడికెళ్లినా ఎప్పుడూ నాతోనే తీసుకెళ్తా. నా తల్లిదండ్రులు నన్ను ఉన్నతమైన విలువలను రంగరించి పెంచారు. నా ఇష్టాయిష్టాలను పట్టించుకున్నారు. జ్ఞానసముపార్జనకు అవకాశమున్న కుటుంబంలో పెరగడం నా అదృష్టం’’ అని చెప్పారు. ‘‘ప్రధాని మోదీ అభిలబించిన 3ఎస్‌ (స్పీడ్, సింప్లిసిటీ, సర్వీస్‌– వేగం, నిరాడంబరత, సేవలు) అందేలా భారత్‌లో ఆవిష్కృతమవుతోన్న డిజిటల్‌ పరివర్తనను మరింత పరుగులు పెట్టించేందుకు పిచాయ్‌ కృషిచేయాలని ఇండియా కౌన్సిల్‌ జనరల్‌ టీవీ నాగేంద్ర ప్రసాద్‌ అభిలషించారు.

Russian oil: బ్యారెల్‌@60 డాలర్లు

Putin


ఉక్రెయిన్‌పై 9 నెలలుగా రష్యా చేస్తున్న యుద్ధానికి నిధుల లభ్యతను వీలైనంత తగ్గించడం. నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలకు అడ్డుకట్ట వేయడం. ఈ రెండు లక్ష్యాల సాధనకు యూరోపియన్‌ యూనియన్‌ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి కొనుగోలు చేసే చమురు ధరకు బ్యారెల్‌కు 60 డాలర్ల పరిమితి విధించింది. సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం ఈయూ సభ్య దేశాల మధ్య చివరి నిమిషంలో ఎట్టకేలకు డిసెంబ‌ర్ 3వ తేదీ ఇందుకు అంగీకారం కుదిరింది. అమెరికా, జపాన్, కెనడా తదితర జీ 7 దేశాలు కూడా ఈ నిర్ణయానికి అంగీకారం తెలిపాయి. ఇది డిసెంబ‌ర్ 5వ తేదీ నుంచి అమల్లోకి వ‌చ్చింది. దీని ప్రకారం ఈయూ, జీ 7 దేశాలకు చమురును బ్యారెల్‌ 60 డాలర్లు, అంతకంటే తక్కువకు మాత్రమే రష్యా విక్రయించాల్సి ఉంటుంది. అయితే ఈ పరిమితిని రష్యా తిరస్కరించింది. 

Success Story: నాడు పశువులకు కాప‌ల ఉన్నా.. నేడు దేశానికి కాప‌ల కాసే ఉద్యోగం చేస్తున్నా.. ఇందుకే..
ఈయూ తదితర దేశాలకు చమురు ఎగుమతులను నిలిపేస్తామని హెచ్చరించింది. ‘‘ఈ ఏడాది నుంచి యూరప్‌ రష్యా చమురు లేకుండా మనుగడ సాగించాల్సి వస్తుంది’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్, అంతర్జాతీయ సంస్థల్లో రష్యా శాశ్వత ప్రతినిధి మిఖాయిల్‌ ఉల్యనోవ్‌ హెచ్చరించారు. ఈయూ పరిమితితో పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదంటూ నిపుణులు కూడా పెదవి విరుస్తున్నారు. ‘‘రష్యా ఇప్పటికే భారత్, చైనా తదితర ఆసియా దేశాలకు అంతకంటే తక్కువకే చమురు విక్రయిస్తోంది. రష్యాను నిజంగా బలహీన పరచాలనుకుంటే బ్యారెల్‌కు 50 డాలర్లు, వీలైతే 40 డాలర్ల పరిమితి విధించాల్సింది’’ అని అభిప్రాయపడుతున్నారు. ఈయూ నిర్ణయం ప్రభావం రానున్న రోజుల్లో యూరప్‌ దేశాలపై, రష్యాపై, మిగతా ప్రపంచంపై ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది. 
రూటు మార్చిన రష్యా 
రష్యా ప్రపంచంలో రెండో అతి పెద్ద చమురు ఉత్పత్తిదారు. సగటున రోజుకు 50 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలయ్యేదాకా యూరప్‌ దేశాలే దానికి అతి పెద్ద చమురు మార్కెట్‌. వాటి కఠిన ఆంక్షల నేపథ్యంలో కథ మారింది. యూరప్‌ ఎగుమతుల్లో చాలావరకు భారత్, చైనాలకు మళ్లించింది. అయితే కరోనా కల్లోలం నేపథ్యంలో చైనా చమురు దిగుమతులను బాగా తగ్గించుకుంటోంది. ఇదిలాగే కొనసాగితే రష్యా తన చమురు ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి రావచ్చు. లభ్యత తగ్గి ధరలకు మళ్లీ రెక్కలు రావచ్చు. చలికాలం కావడంతో చమురు, సహజవాయువు వినియోగం భారీగా పెరిగే ఈయూ దేశాలను ఈ పరిణామం మరింతగా కలవరపెడుతోంది. ‘‘చమురు ధరలు ఏ 120 డాలర్లో ఉంటే 60 డాలర్ల పరిమితి రష్యాకు దెబ్బగా మారేది. కానీ ఇప్పుడున్నది 87 డాలర్లే. రష్యాకు ఉత్పాదక వ్యయం బ్యారెల్‌కు కేవలం 30 డాలర్లే! ’’ అని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.

TSPSC & APPSC Groups Best Books: గ్రూప్స్‌కు ప్రిపేర‌య్యే అభ్యర్థులు ఈ పుస్తకాలను చ‌దివారంటే..

Canada Jobs: భారతీయులకు కెనడా శుభవార్త
కెనడాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ వృత్తినిపుణుల కుటుంబసభ్యులకు తీపి కబురు! ఓపెన్‌ వర్క్‌ పర్మిట్‌ (ఓడబ్ల్యూపీ) కింద అక్కడ పనిచేస్తున్న భారతీయుల కుటుంబసభ్యులు కూడా ఇకపై తాత్కాలిక వర్క్‌ పర్మిట్లతో పనిచేసుకోవచ్చు. వలసలు, శరణార్థులు, పౌరసత్వ వ్యవహారాల మంత్రి సీన్‌ ఫ్రాసర్ డిసెంబ‌ర్ 3న‌ ఈ మేరకు ప్రకటించారు. వర్క్‌ పర్మిట్లున్న వారి జీవిత భాగస్వామి, పిల్లలు వచ్చే ఏడాది నుంచి ఉద్యోగాలు చేసుకోవచ్చంటూ ట్వీట్‌ చేశారు. ‘‘దేశంలో సమస్యగా మారిన ఉద్యోగుల కొరతకు పరిష్కారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. దీంతో 2,00,000 మందికిపైగా ఉన్న విదేశీ ఉద్యోగులకు తోడు వారి కుటుంబసభ్యులకు కెనడాలో కొలువుకు అవకాశం దక్కుతుంది. గతంలో ఓపెన్‌ వర్క్‌ పర్మిట్‌ ఉన్న ఉద్యోగి హై–స్కిల్డ్‌ ఉద్యోగం చేస్తేనే జీవితభా గస్వామికి వర్క్‌ పర్మిషన్‌ ఇచ్చేవాళ్లం. నిబంధనలను సడలించడంతో వర్క్‌ పర్మిట్‌ ఉద్యోగు లు కుటుంబంతో కలిసుంటారు. వారి శారీరక ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది’ అని ఫ్రాసర్‌ అభిప్రాయపడ్డారు. దీన్ని మూడు దశల్లో అమలు చేస్తారు.

New Zealand:న్యూజిలాండ్‌లో 16 ఏళ్లకే ఓటు హక్కు

Swachh Survekshan Grameen Awards: స్వ‌చ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ అవార్డుల్లో సిరిసిల్ల టాప్‌

siricilla


స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌–2023 అవార్డుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశంలోనే ఫోర్‌ స్టార్‌ ర్యాంకింగ్‌ కేటగిరిలో మొదటి స్థానం దక్కింది. జిల్లాలోని అన్ని గ్రామాలను ఓడీఎఫ్‌ (బహిరంగ మలవిసర్జన రహితం) ప్లస్‌ కేటగిరిలో మోడల్‌ గ్రామాలుగా తీర్చిదిద్దినందుకుగాను ఈ అవార్డు లభించింది. కేంద్ర తాగునీరు–పారిశుధ్య మంత్రిత్వ శాఖ శనివారం ఈ విషయా­న్ని వెల్లడించింది. ఓడీఎఫ్‌ ప్లస్‌ మోడల్‌ కింద అన్ని గ్రామాల్లోని ఇళ్లు, సంస్థలలో మరుగుదొడ్లు నిర్మించుకొని వినియోగించుకోవడం, గ్రామాలలో తడి, పొడి చెత్త సక్రమ నిర్వహణ, కంపోస్ట్‌ షెడ్ల వినియోగం, అన్ని గ్రామాలలో మురుగు నీటి నిర్వహణ, అన్నింటినీ పరిశుభ్ర గ్రామాలుగా తీర్చి దిద్దడంతో పా­టు ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యానికి సంబంధించిన వా­ల్‌ పెయింటింగ్స్‌ ఏర్పాటు చేయడం అనే అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ అవార్డును ప్రకటించారు. 

Gold ATM: దేశంలో తొలి గోల్డ్‌ ఏటీఎం ప్రారంభం
నగదు ఉపసంహరణ, జమకు ఉపయోగించే ఏటీఎంల తరహాలోనే డెబిట్, క్రెడిట్‌ కార్డులతో బంగారం విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా దేశంలోనే తొలిసారిగా గోల్డ్‌ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. గోల్డ్‌ సిక్కా ఆధ్వర్యంలో బేగంపేటలోని అశోకా రఘుపతి చాంబర్స్‌లో గల ఆ సంస్థ కార్యాలయంలో ఏర్పాటైన ఈ ఏటీఎంను డిసెంబ‌ర్ 3వ తేదీ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీ­తా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి గోల్డ్‌ ఏటీఎం నిదర్శనమన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఈ గోల్డ్‌ ఏటీఎంలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. 
గోల్డ్‌ సిక్కా సంస్థ సీఈఓ సయ్యద్‌ తరుజ్‌ మాట్లాడుతూ.. ఈ గోల్డ్‌ ఏటీఎం ద్వారా 99.99% నాణ్యత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలను విత్‌ డ్రా చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం డెబిట్, క్రెడిట్‌ కార్డులతో పాటు తాము జారీ చేసే ప్రీపెయిడ్‌ కార్డులనూ ఉపయోగించవచ్చన్నారు. ఒక్కో మిషన్‌లో ఒకేసారి రెండున్నర కోట్ల విలువైన ఐదు కేజీల పసిడిని లోడ్‌ చేయవచ్చన్నారు. భారత్‌లో గోల్డ్‌ మార్కెట్‌ వేళలకు అనుగుణంగా ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఏటీఎంల ద్వారా గోల్డ్‌ తీసుకోవచ్చని తెలిపారు.  త్వరలోనే ఎయిర్‌పోర్ట్, పాతబస్తీలో మూడు ఏటీఎంలు, సికింద్రాబాద్, అబిడ్స్‌లతో పాటు పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్‌లలో కూడా గోల్డ్‌ ఏటీఎంలను ప్రారంభించనున్నామని చెప్పారు. రానున్న రెండేళ్లల్లో దేశవ్యాప్తంగా 3,000 యంత్రాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వివరించారు. 

► ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భార‌త్‌కు 11 పతకాలు

Tribal Women: అడవిని సృష్టించిన గిరిజ‌న మ‌హిళ‌లు.. 
అది ఒడిశాలోని మారుమూల కోరాపూట్‌ జిల్లా. అందులో మరింత మారుమూలన ఉండే గిరిజన గ్రామం. పేరు ఆంచల. 1990ల నాటి సంగతి. వంట చెరుకు కోసమని, ఇతర అవసరాలకని ఊరి పక్కనున్న పవిత్ర ‘మాలీ పర్వతం’ మీది చెట్లను విచక్షణారహితంగా నరికేస్తూ పోయారు. ఫలితం...? చూస్తుండగానే పచ్చదనం జాడలనేవే లేకుండా గుట్ట పూర్తిగా బోసిపోయింది. జరిగిన నష్టాన్ని గుర్తించేలోపే మరుభూమిగా మారింది. దాని పై నుంచి వచ్చే అందమైన సెలయేటి ధార కూడా శాశ్వతంగా ఆగిపోయింది. దాంతో అడవి బిడ్డలైన ఆ గిరిజనులు తల్లడిల్లారు. ముందుగా మహిళలే కళ్లు తెరిచారు. చిట్టడవికి తిరిగి జీవం పోసి పవిత్ర పర్వతానికి పూర్వపు కళ తేవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం 30 ఏళ్లు అకుంఠిత దీక్షతో శ్రమించారు. తమకు ప్రాణప్రదమైన అడవికి పునఃసృష్టి చేసి నారీ శక్తిని మరోసారి చాటారు. ఫలితంగా నేడు కొండమీది 250 ఎకరాల్లోనే గాక ఊరి చుట్టూ పచ్చదనం దట్టంగా పరుచుకుని కనువిందు చేస్తోంది. 

Success Story : ఇంటర్‌లో పెళ్లి.. సెలవుల్లో కూలీ .. ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే సివిల్స్‌లో ర్యాంకు
ఒక్కతాటిపై నిలిచి..
అయితే ఈ బృహత్కార్యం చెప్పినంత సులువుగా ఏమీ జరగలేదు. ఇందుకోసం గ్రామస్తులంతా ఒక్కతాటిపై నిలిచి కష్టపడ్డారు. మొదట్లో మూణ్నాలుగు కుటుంబాలు ఒకేచోట వండుకోవడం మొదలు పెట్టారు. క్రమంగా వంట కోసం కట్టెలపై ఆధారపడటాన్ని వీలైనంతగా తగ్గించుకుంటూ వచ్చారు. సేంద్రియ సాగుకు మళ్లారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకున్నారు. అంతేగాక చెట్లను నరికే వారికి రూ.500 జరిమానా విధించారు. ముక్కు పిండి మరీ వసూలు చేయడమే గాక నలుగురిలో నిలబెట్టి నలుగు పెట్టడం వంటి చర్యలు తీసుకున్నారు. చెట్లు నరికేందుకు దొంగతనంగా ఎవరూ కొండపైకి వెళ్లకుండా ఒక కుటుంబాన్ని కాపలాగా పెట్టారు. వారికి జీతమిచ్చేందుకు డబ్బుల్లేకపోవడంతో ఊరంతా కలిసి వారికి 10 కిలోల రాగులిస్తూ వచ్చామని సుపర్ణ అనే గ్రామస్తురాలు గుర్తు చేసుకుంది. ఈ ఉద్యమం మొదలైన రోజుల్లోనే 15 ఏళ్ల వయసులో నవ వధువుగా తాను ఊళ్లో అడుగు పెట్టానని చెప్పుకొచి్చంది. ‘‘మా శ్రమ ఫలించి మేం నాటిన చెట్లు చిగురించడం మొదలు పెట్టినప్పటి మా సంతోషాన్ని మాటల్లో చెప్పలేం’’ అని చెబుతూ సవిత అనే మరో గ్రామస్తురాలు సంబరపడిపోయింది. 
కొసమెరుపు 
30 ఏళ్ల కింద మూగబోయిన జలధార కూడా మహిళల మొక్కవోని ప్రయత్న ఫలితంగా మళ్లీ ప్రాణం పోసుకుంది. కొండ మీది నుంచి జలజలా పారుతూ ఒకప్పట్లా కనువిందు చేస్తోంది!  

Success Story : నలుగురు తోబుట్టువుల్లో.. ముగ్గురు ఐఏఎస్‌లు.. ఒక ఐపీఎస్‌.. వీరి స‌క్సెస్ సీక్రెట్ మాత్రం ఇదే..

Morality Police: ఇరాన్‌లో ‘నైతిక పోలీస్‌’ రద్దు 
మహ్‌సా అమినీ (22) అనే కుర్దిష్‌ యువతి మరణంతో ఇరాన్‌ నెలలుగా కొనసాగుతున్న హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గింది. న్యాయవ్యవస్థతో సంబంధం లేని నైతిక పోలీస్‌ వ్యవస్థను రద్దు చేసింది. ఒక మత కార్యక్రమంలో ఓ వ్యక్తి ప్రశ్నకు బదులుగా ఇరాన్‌ అటార్నీ జనరల్‌ ఈ మేరకు తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇరాన్‌ గణతంత్ర, ఇస్లామిక్‌ పునాదులు రాజ్యాంగబద్ధంగా స్థిరంగా ఉన్నాయని, అయితే అమలు విధానాలు సరళంగా ఉంటాయని అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ న‌వంబ‌ర్ 3వ తేదీ వ్యాఖ్యానించారు.
హిజాబ్‌ సరిగా ధరించలేదని అమినిని నైతిక పోలీసులు సెప్టెంబర్‌ 16న అరెస్ట్‌ చేయడం, మూడు రోజుల తర్వాత ఆమె కస్టడీలోనే మరణించడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేగాయి. మహిళలకు కఠినమైన డ్రెస్‌ కోడ్‌ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు రాజుకున్నాయి. బలగాలు కాల్పుల్లో వందలాదిగా చనిపోయారు. అమిని పేరు, ఫొటో ప్రదర్శిస్తూ ఇరాన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనల్లో పాల్గొన్న మహిళలు హిజాబ్‌ను కాల్చివేయడం, బహిరంగంగా జుత్తును కత్తిరించుకోవడం చేశారు. 
నైతిక పోలీసింగ్‌ ఇలా మొదలైంది..
అతివాద అధ్యక్షుడు అహ్మదీ నెజాది హయాంలో 2006లో గష్త్‌–ఇ–ఇర్షాద్‌ (మార్గదర్శక పహారా) పేరుతో ఈ వ్యవస్థ ఏర్పాటైంది. ఇందులో భాగంగా మహిళలకు హిజాబ్‌ ధారణ తప్పనిసరి చేశారు. 15 ఏళ్ల క్రితం దాకా నైతిక పోలీసులు ముందుగా హెచ్చరించి, అయినా ఖాతరు చేయని మహిళలను అరెస్ట్‌ చేసేవారు. ఈ ప్రత్యేక బలగాల పాత్రపై మొదట్నుంచీ వివాదాలు నడుస్తున్నాయి. ఇరాన్‌ అధ్యక్షులుగా చేసిన వారిలోనే దీనిపై భిన్నాభిప్రాయాలుండేవి. మహిళల దుస్తుల నిబంధనలు కూడా మారుతూ వచ్చాయి. ఆధునిక భావాలున్న అధ్యక్షుడు రౌహానీ హయాంలో మహిళలు బిగుతైన జీన్స్,  రంగురంగుల హిజాబ్‌ ధరించే వీలు కలి్పంచారు. కానీ సంప్రదాయ భావాలున్న రైసి ఈ ఏడాది జూలైలో పగ్గాలు చేపట్టాక నిబంధనలు కఠినతరమయ్యాయి. అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ మహిళలు హిజాబ్‌ ధరించడం తప్పనిసరి చేశారు. 

6511 ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

Tata Steel Blitz Champion: ‘బ్లిట్జ్‌’ చాంపియన్‌గా అర్జున్‌ 
టాటా స్టీల్‌ ఇండియా చెస్‌ అంతర్జాతీయ టోర్నీ బ్లిట్జ్‌ ఈవెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ ఓపెన్‌ విభాగంలో విజేతగా నిలిచాడు. పది మంది మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో 18 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో వరంగల్‌కు చెందిన 19 ఏళ్ల అర్జున్‌ 12.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 
చాంపియన్‌గా నిలిచిన అర్జున్‌కు 7,500 డాలర్ల (రూ.6 లక్షల 10 వేలు) ప్రైజ్‌మనీతోపాటు ట్రోఫీ లభించింది. 10 గేముల్లో గెలిచిన అర్జున్‌ ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని మరో మూడు గేముల్లో ఓడిపోయాడు. 11.5 పాయింట్లతో నకముర (అమెరికా) రెండో స్థానంలో, 9.5 పాయింట్లతో షఖిర్యార్‌ (అజర్‌బైజాన్‌) మూడో స్థానంలో నిలిచారు. ఇదే టోర్నీ ర్యాపిడ్‌ ఈవెంట్‌లో అర్జున్‌ రన్నరప్‌గా నిలిచాడు. 
హారికకు మూడో స్థానం..
బ్లిట్జ్‌ ఈవెంట్‌ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక మూడో స్థానంలో నిలిచింది. నిర్ణీత 18 రౌండ్ల తర్వాత హారిక 11 పాయింట్లు సాధించింది. ఎనిమిది గేముల్లో గెలిచిన హారిక, ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు గేముల్లో ఓడిపోయింది. ర్యాపిడ్‌ ఈవెంట్‌లోనూ హారికకు మూడో స్థానం లభించింది. భారత్‌కే చెందిన వైశాలి 13.5 పాయింట్లతో బ్లిట్జ్‌ ఈవెంట్‌లో టైటిల్‌ దక్కించుకోగా, మరియా (ఉక్రెయిన్‌) 12 పాయింట్లతో రన్నరప్‌గా నిలి చింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి 9.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. విజేత వైశాలికి 7,500 డాలర్లు (రూ. 6 లక్షల 10 వేలు), మూడో స్థానంలో నిలిచిన హారికకు 3 వేల డాలర్లు (రూ. 2 లక్షల 44 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.   

Unnati Hooda: బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్ రన్నరప్‌గా ఉన్నతి హుడా 
ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ అండర్‌–17 బాలికల సింగిల్స్‌ విభాగంలో భారత క్రీడాకారిణి ఉన్నతి హుడా రన్నరప్‌గా నిలిచింది. థాయ్‌లాండ్‌లో డిసెంబ‌ర్ 4న జరిగిన ఫైనల్లో హరియాణాకు చెందిన టాప్‌ సీడ్‌ ఉన్నతి 18–21, 21–9, 14–21తో సారున్‌రక్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయింది. అండర్‌–17 బాలుర డబుల్స్‌ ఫైనల్లో అర్ష్‌ మొహమ్మద్‌–సంస్కార్‌ (భారత్‌) జోడీ 13–21, 21–19, 22–24తో లాయ్‌ పో యు–లిన్‌ యి హావో (చైనీస్‌ తైపీ) ద్వయం చేతిలో ఓటమి పాలైంది.

Vijay Hazare Trophy: సౌరాష్ట్రదే ‘విజయ్‌’ హజారే ట్రోఫీ

 
 

Published date : 05 Dec 2022 06:42PM

Photo Stories