National Sports Awards: జాతీయ క్రీడా పురస్కారాలు ప్రదానం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడాకారులు, శిక్షకులకు అవార్డులు అందజేశారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ అవార్డును టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ ఆచంట శరత్ కమల్ అందుకున్నాడు. తమిళనాడుకు చెందిన 40 ఏళ్ల శరత్ కమల్ ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల సింగిల్స్, టీమ్, మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకాలతో సహా ఐదు కామన్వెల్త్ క్రీడల్లో కలిపి మొత్తం 13 పతకాలు సాధించాడు. నాలుగుసార్లు ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన శరత్ ఆసియా చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు, ఆసియా క్రీడల్లో రెండు కాంస్యాలు సాధించాడు. కాగా ఈ ఏడాది 25 మందిని ‘అర్జున అవార్డు’ వరించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రపంచ చాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజలు కూడా ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి నుంచి అందుకున్నారు. ఈ జాబితాలో షట్లర్లు హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్.. అథ్లెట్లు సీమా పూనియా, అవినాశ్ సాబ్లే, షూటర్ ఇలవెనిల్, చెస్ ప్లేయర్ ప్రజ్ఞానంద తదితరులు ఉన్నారు. తన కోచింగ్‌తో రోహిత్ శర్మ సహా పలువురు క్రికెటర్లను తీర్చిదిద్దిన దినేశ్ లాడ్‌కు ‘ద్రోణాచార్య’ అవార్డు లభించింది.
6511 ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు: ఆచంట శరత్ కమల్
అర్జున అవార్డులు: సీమా పూనియా (అథ్లెటిక్స్), ఆల్డస్ పాల్ (అథ్లెటిక్స్), అవినాష్ సాబుల్ (అథ్లెటిక్స్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), హెచ్ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్), అమిత్ (బాక్సింగ్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), భక్తి కులకర్ణి (చెస్) , ఆర్ ప్రజ్ఞానంద (చెస్), దీప్ గ్రేస్ ఇక్కా (హాకీ), సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లోన్‌బాల్), సాగర్ ఓవల్కర్ (మల్కాంబ్), ఎలవెనిల్ వలరివన్ (షూటింగ్), ఓంప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్) శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్), అన్షు (రెజ్లింగ్), సరిత (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మాన్సీ జోషి (పారా బ్యాడ్మింటన్), తరుణ్ ధిల్లాన్ (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్), జెర్లిన్ అనికా జె (చెవిటి బ్యాడ్మింటన్)
ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్ విభాగంలో కోచ్‌లకు): జీవన్‌జోత్ సింగ్ తేజ (ఆర్చరీ), మహ్మద్ అలీ కమర్ (బాక్సింగ్), సుమా షిరూర్ (పారా-షూటింగ్) మరియు సుజిత్ మాన్ (రెజ్లింగ్)
జీవితకాల పురస్కారం: దినేష్ లాడ్ (క్రికెట్), బిమల్ ఘోష్ (ఫుట్‌బాల్), రాజ్ సింగ్ (రెజ్లింగ్)
ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: అశ్విని అక్కుంజీ (అథ్లెటిక్స్), ధరమ్‌వీర్ సింగ్ (హాకీ), బిసి సురేష్ (కబడ్డీ), నీర్ బహదూర్ గురుంగ్ (పారా అథ్లెటిక్స్)