AP Police Jobs 2022 Notification PDF : 6511 ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొద్ది నెలల క్రితం పోలీసు శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈమేరకు పోలీసు శాఖ రూపొందించిన నియామక ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించి.. నేడు నోఫికేషన్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 19న ఎస్‌ఐ పోస్టులకు, జనవరి 22న కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించునున్నారు. మొత్తం 6511 ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది
➤ Competitive Exams: కోచింగ్ తీసుకోకుండా గ్రూప్స్, ఎస్‌ఐ తదితర పరీక్షల్లో విజయం సాధ్యమా..? కాదా..?
పోస్టుల వివరాలు ఇవే..
411 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ పోస్టుల్లో కానిస్టేబుల్ వాటిలో 315 ఎస్‌ఐ, 96 రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్, 3,580 కానిస్టేబుల్ (సివిల్), ఏపీఎస్పీలో 2,520 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.
➤ GK & Current Affairs: పోలీసు ఉద్యోగాల రాతపరీక్షలో.. కరెంట్ అఫైర్స్, జీకే పాత్ర..
కానిస్టేబుల్ పోస్టులకు..
కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22వ తేదీన ప్రిలిమనరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు స్వీకరణ నవంబర్ 30 నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఎస్సై పోస్టులకు..
ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19వ తేదీన ప్రిలిమనరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్ఐ పోస్టులకు డిసెంబరు 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది.
➤ Inspiring Story: నేను ఎస్‌ఐ అయ్యానిలా.. అమ్మ కూలి పనులు చేస్తూ..
➤ Madhavi, CI : పొట్టకూటి కోసమే ఈ పోలీసు ఉద్యోగంలో చేరా.. కానీ
వీరికి 5 శాతం నుంచి 25% వరకు..
సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్స్ విభాగాల్లో మహిళా, పురుష కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు వర్తింపజేశారు. ఏపీఎస్పీ, ఎస్‌ఏఆర్ సీపీఎల్, ఫిట్టర్ ఎల్రక్టీషియన్, మెకానిక్స్, డ్రైవర్ కేటగిరీల్లో పురుష కానిస్టేబుల్ పోస్టులే భర్తీ చేస్తారు. కాబట్టి ఆ విభాగాల పోస్టుల భర్తీలో పురుష హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. కానిస్టేబుల్ నియామకాల్లో కేటగిరీలవారీగా 5 శాతం నుంచి 25% వరకు హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం.ఈమేరకు ‘ఆంధ్రప్రదేశ్ పోలీస్ రూల్స్ 1999’కి సవరణ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. ఇక నుంచి కానిస్టేబుల్ నియామకాల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తారు. దీనివల్ల రాష్ట్రంలో 15 వేల మంది హోంగార్డులకు ప్రయోజనం కలగనుంది.
6100 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇవే..