Vijay Hazare Trophy: సౌరాష్ట్రదే ‘విజయ్’ హజారే ట్రోఫీ
Sakshi Education
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్ర జట్టు చాంపియన్‌గా నిలిచింది.
ఫైనల్లో సౌరాష్ట్ర ఐదు వికెట్ల తేడాతో మహారాష్ట్ర జట్టును ఓడించింది. షెల్డన్ జాక్సన్ (133 నాటౌట్; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ సెంచరీతో సౌరాష్ట్ర విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొదట మహారాష్ట్ర 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (108; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. అనంతరం సౌరాష్ట్ర 46.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసి గెలిచింది.
Ruturaj Gaikwad:ఒకే ఓవర్లో 7 సిక్సర్లు.. రికార్డు బద్దలు..
Published date : 03 Dec 2022 03:27PM