G20 summit: జీ-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్
Sakshi Education
ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరుపొందిన జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ ఈరోజు(డిసెంబర్ 1) చేపట్టింది.
ఇటీవల ఇండోనేషియాలో జరిగిన జీ-20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్‌కు బదిలీ చేశారు. డిసెంబరు 1 నుంచి జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తుందని ఆ సమావేశంలో ప్రకటించారు. భారత్ ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనుంది. ఈ ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో వివిధ అంశాలపై 200 సమావేశాలను నిర్వహించనున్నారు. జీ-20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో ప్రత్యేక లోగోను రూపొందించారు. దేశంలోని 100 స్మారక చిహ్నాలపై ఈ లోగోను ప్రదర్శించనున్నారు. ఈ లోగోను త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా రూపొందించారు. జీ 20 అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని మోదీ అన్నారు. 2024లో బ్రెజిల్‌లోనూ, ఆ తర్వాత ఏడాది 2025లో దక్షిణాఫ్రికాలోనూ జీ 20 సదస్సు జరగనుంది.
G20 summit : బంధం బలోపేతం.. జో బైడెన్‌తో ప్రధాని మోదీ చర్చలు
Published date : 01 Dec 2022 05:54PM