G20 presidency to India : భార్‌త్‌కు జీ 20 అధ్యక్ష బాధ్యతలు.. అందరినీ కలుపుకొనిపోతామన్న మోదీ
వచ్చే ఏడాది సదస్సు భారత్ ఆధ్వర్యంలో జరగనుంది. జీ 20 అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని మోదీ అన్నారు.
‘‘ఇవి అత్యంత ప్రతిష్మాత్మక బాధ్యతలు. సభ్య దేశాల సహాయ సహకారాలతో ప్రపంచ సంక్షేమానికి జీ 20 సదస్సును వేదికగా మారుస్తాం. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభం, ఆహారం, ఇంధన ధరల పెరుగుదల వంటి సమస్యల నేపథ్యంలో కూటమి సారథ్య బాధ్యతలు స్వీకరిస్తున్నాం. అన్ని దేశాలు జీ 20 వైపే ఆశగా చూస్తాయి. భారత్ ఆధ్వర్యంలో జీ 20 అందరినీ కలుపుకొని పోతూ నిర్ణయాత్మకంగా, చర్యలు తీసుకునేలా ఉంటుంది. వచ్చే ఏడాదిలోగా జీ 20 కొత్త కొత్త ఆలోచనలు చేసి, సమష్టి నిర్ణయాలు తీసుకునేలా తీర్చిదిద్దుతాం’’ అని అన్నారు. 2024లో బ్రెజిల్‌లోనూ, ఆ తర్వాత ఏడాది 2025లో దక్షిణాఫ్రికాలోనూ జీ 20 సదస్సు జరగనుంది.
G20 summit : బంధం బలోపేతం.. జో బైడెన్‌తో ప్రధాని మోదీ చర్చలు