New Zealand:న్యూజిలాండ్‌లో 16 ఏళ్లకే ఓటు హక్కు
Sakshi Education
ఓటు హక్కు అర్హతను 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించే ప్రతిపాదనను పార్లమెంట్‌లో ప్రవేశ పెడతామని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ చెప్పారు. దేశ సుప్రీంకోర్టు కూడా 16 ఏళ్ల వారికి ఓటు హక్కు కల్పించడంపై సానుకూలంగా స్పందించడంతో నవంబర్ 21న(సోమవారం) ఆమె ఈ ప్రకటన చేశారు.
రాబోయే నెలల్లో ఈ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చిస్తామన్నారు. రాజ్యాంగం ప్రకారం ఇలాంటి వాటిపై పార్లమెంట్‌లోని 75% మంది సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే, రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తుండటంతో ‘16 ఏళ్లకే ఓటు’ ఇప్పట్లో కార్యరూపం దాల్చే అవకాశాల్లేవు. కాగా, 16 ఏళ్ల వారికీ ఓటు హక్కు కల్పించిన దేశాల్లో ఆ్రస్టియా, మాల్టా, బ్రెజిల్, క్యూబా, ఈక్వెడార్ ఉన్నాయి.
➤ ఓటు హక్కు లేదా..? అయితే ఆన్‌లైన్‌లో ఇలా నమోదు చేసుకోండి..
Published date : 22 Nov 2022 01:15PM