Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జులై 18th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu July 18th 2022(డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu July 18th 2022
Current Affairs in Telugu July 18th 2022

Environmental Movements: ఉత్తరాఖండ్‌లో సరికొత్త హరిత ఉద్యమం 
కోతులు, అడవి పందులు, ఎలుగుబంట్లు.. దేశమంతటా ఇప్పుడొక పెను సమస్య. ఆహార కొరతకు తాళలేక తమ సహజ ఆవాసాలైన అడవులను వదిలేసి ఊళ్లపై పడుతున్నాయి. తోటలు, పంట పొలాలను పాడు చేస్తున్నాయి. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అటవీ జంతువుల వల్ల జరిగే నష్టాన్ని భరించలేక చాలాచోట్ల ఏకంగా సాగుకే దూరమవుతున్నారు. ఇక కోతుల వల్ల ఊళ్లలో జనం పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఉత్తరాఖండ్‌కు చెందిన ద్వారకా ప్రసాద్‌ సెమ్వాల్‌ను ఈ పరిస్థితి బాగా ఆలోచింపజేసింది. అడవుల్లో వృక్ష సంపద నశిస్తుండడం, జంతువులక ఆహారం దొరక్కపోవడమే సమస్యకు కారణమని గుర్తించారు. పరిష్కారానికి నడం బిగించారు. ఆ క్రమంలో ఆయన మదిలో మొలకెత్తిన ఆలోచనే... విత్తన బాంబులు. 

Also read: Climate Change: మన పాపం! ప్రకృతి శాపం!!

ఉత్తరాఖండ్‌లో శ్రీకారం 
అడవుల్లో సమృద్ధిగా ఆహారం లభిస్తే జంతువులు పంట పొలాలపై దాడి చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే వాటికి అడవుల్లోనే ఆహారం లభించే ఏర్పాటు చేయాలని ద్వారకా నిర్ణయించారు. పండ్లు, కూరగాయల మొక్కలు నాటేందుకు విత్తన బాంబులు రూపొందించారు. మట్టి, కంపోస్టు ఎరువు, విత్తనాలతో టెన్నిస్‌ బంతుల పరిమాణంలో తయారు చేశారు. 2017 జూలై 9న ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ చేతుల మీదుగా ఈ బృహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో, అడవుల్లో విత్తన బాంబులు వెదజల్లారు. వర్షం పడగానే అవి మొక్కలుగా ఎదిగాయి. పండ్లు, కూరగాయలు పండి జంతువులకు ఆహార కొరత తీరింది. ఇందుకు ద్వారకా ప్రసాద్‌ పెద్ద యజ్ఞమే చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలు, గ్రామ పంచాయతీలను, విద్యార్థులను భాగస్వాములను చేశారు. అక్కడి వాతావరణానికి సరిపోయే విత్తనాలను స్థానికుల నుంచే సేకరించారు. ఈ యజ్ఞంలో 2 లక్షల మంది చేయూతనిస్తున్నారు. వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

Also read: Plastic waste: సముద్రాల్లోని ప్లాస్టిక్‌ ఏరివేతకు వాటర్ షార్క్ లు

8 రాష్ట్రాల్లో సేవలు 
ద్వారకా ప్రసాద్‌ హరిత ఉద్యమం 18 రాష్ట్రాలకు విస్తరించింది. రాజస్తాన్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, హరియాణా, పంజాబ్, చండీగఢ్, ఒడిశా, తమిళనాడు, అస్సాం, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లో అడవులను పెంచే పనిలో ప్రస్తుతం ఆయన నిమగ్నమయ్యారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తనకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నాయని చెప్పారు. మిగతా రాష్ట్రాలకు సేవలను విస్తరింపజేస్తానన్నారు.

Also read: తుపాన్లకు పేర్లు... ఎవరు... ఎందుకు పెడతారో తెలుసా?
 

Vice Presidential Candidates 2022: ఉపరాష్ట్రపతిగా అభ్యర్థులుగా జగదీప్, మార్గరెట్ ఆల్వా 


అధికార ఎన్డీఏ, విపక్ష పార్టీల కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్డీఏ తమ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్, జాట్ నాయకుడు జగదీప్ ధన్ ఖడ్ (71)ను బరిలో దింపగా... విపక్షాలు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు మార్గరెట్‌ అల్వా (80) ను పోటీలో నిలిపాయి.  

Also read: Food Security Rankings: ‘ఆహార భద్రత’ అమలులో ఒడిశా నంబర్‌వన్‌

అనూహ్యంగా... ధన్ ఖడ్ 
ఎన్డీయే అభ్యర్థిగా అనూహ్యంగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ పేరును బీజేపీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. హరియాణా, రాజస్తాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కీలక సామజికవర్గమైన జాట్ల మద్దతు కూడగట్టడానికి ఆయనను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వ్యవసాయదారులైన జాట్లు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు.  

Also read: Gotabaya Rajapaksa : శ్రీలంక అధ్యక్షుడు గొటబయా రాజపక్స రాజీనామా.. కారణం ఇదే..?

అంచలంచెలుగా ఎదుగుతూ...
జగదీప్‌ ధన్‌ఖడ్‌ 1951 మే 18న రాజస్తాన్‌లోని ఝున్‌ఝున్‌ జిల్లాలో మారుమూల కిథానా గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చీత్తోర్‌గఢ్‌ సైనిక్‌ స్కూల్‌లో పాఠశాల విద్య అభ్యసించారు. జైపూర్‌లోని మహారాజా కాలేజీలో ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్తాన్‌ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. రాజస్తాన్‌లో ప్రముఖ లాయర్‌గా గుర్తింపు పొందారు. రాజస్తాన్‌ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులోనూ లాయర్‌గా ప్రాక్టీస్‌ చేశారు. తర్వాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో ఝున్‌ఝున్‌ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 1990లో చంద్రశేఖర్‌ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1993లో రాజస్తాన్‌లో అజీ్మర్‌ జిల్లాలోని కిషన్‌గఢ్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 జూలైలో పశి్చమ బెంగాల్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో అనేక విషయాల్లో ధన్‌ఖఢ్‌ విభేదించినట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు భార్య సుదేశ్‌ ధన్‌ఖడ్, ఓ కుమార్తె ఉన్నారు.

Also read: U.K. Leadership: బ్రిటన్‌ ప్రధాని రేసులో ముందున్న రిషి

మార్గరెట్ అల్వా.. సుదీర్ఘ రాజకీయ జీవితం   
జూలై 17న ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ నివాసంలో జరిగిన 17 పార్టీల భేటీలో విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వాను బరిలో దించాలని నిర్ణయించారు. భేటీకి రాని తృణమూల్‌ కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా మద్దతిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జేఎంఎం కూడా అల్వాకే మద్దతిస్తుందని వివరించారు. మల్లికార్జున ఖర్గే, జైరాం రమేశ్‌ (కాంగ్రెస్‌), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), సంజయ్‌ రౌత్‌ (శివసేన), కె.కేశవరావు (టీఆర్‌ఎస్‌), టీఆర్‌ బాలు (డీఎంకే), రాంగోపాల్‌ యాదవ్‌ (ఎస్పీ), వైగో (ఎండీఎంకే), ఏడీ సింగ్‌ (ఆర్జేడీ), మహ్మద్‌బార్‌ (ఐఎంయూఎల్‌), జోస్‌ కె.మణి (కేరళ కాంగ్రెస్‌–ఎం) భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ భాగస్వామ్య పక్షాలైన శివసేన, జేఎంఎం రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ముర్ముకు మద్దతు ప్రకటించడం తెలిసిందే.

Also read: Weekly Current Affairs (Economy) Bitbank: భారతదేశపు మొట్టమొదటి దంత ఆరోగ్య బీమా పథకాన్ని ఏ బీమా కంపెనీ ప్రారంభించింది?

సుదీర్ఘ రాజకీయ జీవితం 
విపక్షాల నిర్ణయాన్ని సవినయంగా అంగీకరిస్తున్నట్టు అల్వా ట్వీట్‌ చేశారు. తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలన్నారు.  అల్వా 1942 ఏప్రిల్‌ 14న కర్ణాటకలోని మంగళూరులో పుట్టారు. విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించారు. కేంద్రంలో పలు మంత్రి పదవులు నిర్వహించడంతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా చేశారు.
 
ఉపరాష్ట్రపతి ఎన్నికలో తలపడుతున్న ధన్‌ఖడ్, అల్వా మధ్య ఎన్నో పోలికలున్నాయి. ఇద్దరూ కేంద్ర మంత్రులుగా, గవర్నర్లుగా పని చేశారు. ఇద్దరికీ కాంగ్రెస్‌ నేపథ్యముంది. ఇద్దరూ లా పట్టభద్రులే. ఒక్కసారి మాత్రమే లోక్‌సభకు ఎన్నికయ్యారు. ధన్‌ఖడ్‌ బీజేపీలో చేరకముందు జనతాదళ్, కాంగ్రెస్‌ల్లో పని చేశారు.

Also read: GST: ఐదేళ్లుగా దేశమంతా ఒకే మార్కెట్‌

ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇలా..  
కొత్త ఉప రాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభలో ఎన్నికైన, నామినేటెడ్‌ సభ్యులతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నుకుంటుంది. ఉప రాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి ఎన్నిక విషయానికొస్తే నామినేటెడ్‌ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో రాష్ట్రాలకు ఎలాంటి పాత్ర ఉండదు. పార్లమెంట్‌ ఉభయ సభల్లోని సభ్యులంతా కలిసి ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఒక్కో ఎంపీ ఓటు విలువ ఒకటి. అందరి ఓటు విలువ సమానమే. ప్రస్తుతం పార్లమెంట్‌లో మొత్తం ఎంపీల సంఖ్య 780. బీజేపీకి సొంతంగానే 394 మంది ఎంపీలున్నారు. మెజారిటీ (390) కంటే అధికంగా ఉన్నారు. ఎన్డీయే అభ్యర్థి జగదీప్‌ ధన్‌ఖడ్‌ విజయం నల్లేరు మీద నడకేనని చెప్పొచ్చు. నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 19 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 6వ తేదీన ఓటింగ్‌ నిర్వహిస్తారు.  

Also read: World population Day: 2022 నవంబర్‌ 15 నాటికి 800 కోట్లకి ప్రపంచ జనాభా

 Covid Vaccine @ 200 కోట్ల డోసులు 

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో జూలై 17న దేశం మరో కీలక మైలురాయిని దాటింది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో 18 నెలల వ్యవధిలో 200 కోట్ల డోసులు పైగా పంపిణీ చేసింది. జూలై 17న మధ్యాహ్నం ఒంటిగంట వరకు అందిన సమాచారం మేరకు మొత్తం 2,00,000,15,631 డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలోని వయోజనుల్లో 98% మంది కనీసం ఒక్క డోసైనా వ్యాక్సిన్‌ వేయించుకోగా, 90% మంది పూర్తి రెండు డోసులు వేయించుకున్నట్లు వివరించింది. 

Also read: WHO: కోవిడ్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌కు పేరు ఎలా వచ్చింది?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 100% 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 12 ఏళ్లు పైబడిన అర్హులందరికీ కోవిడ్‌ రెండు డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. అవి అండమాన్‌ నికోబార్‌ దీవులు, జమ్మూకశీ్మర్, హిమాచల్‌ ప్రదేశ్, లక్షద్వీప్, చండీగఢ్, గోవా. అదేవిధంగా, అత్యధికంగా యూపీ 34,41,93,641 డోసులు, మహారాష్ట్ర 17,05,59,447, బెంగాల్‌ 14,40,33,794, బిహార్‌ 13,98,52,042, మధ్యప్రదేశ్‌ 12,13,15,911 డోసులు పంపిణీ చేశాయి.  

World Athletics Championships: ప్రపంచ అథ్లెటిక్స్‌ పురుషుల 100 మీటర్లలో అమెరికా క్లీన్‌స్వీప్‌  

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల 100 మీటర్ల విభాగంలో అమెరికా అథ్లెట్స్‌ క్లీన్‌స్వీప్‌ చేశారు. స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో మెరిపించారు. అమెరికాలోని యుజీన్‌లో జరుగుతున్న పోటీల్లో ఫ్రెడ్‌ కెర్లీ 9.86 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి పసిడి పతకం సాధించడంతోపాటు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. అమెరికాకే చెందిన మార్వీన్‌ బ్రేసీ, ట్రేవన్‌ బ్రోమెల్‌ ఇద్దరూ 9.88 సెకన్లలోనే గమ్యానికి చేరగా... ఫొటో ఫినిష్‌ ద్వారా బ్రేసీకి రజతం, బ్రోమెల్‌కు కాంస్యం ఖాయమయ్యాయి. దాంతో 1991 తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పురుషుల 100 మీటర్ల విభాగంలో మళ్లీ క్లీన్‌స్వీప్‌ నమోదైంది. 1991లో కార్ల్‌ లూయిస్, లెరాయ్‌ బరెల్, డెనిస్‌ మిచెల్‌ అమెరికాకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందించారు. 

Also read: Duvwarapu Sivakumar: అమెరికా తరఫున ఆంధ్ర ఆటగాడు శివకుమార్

శ్రీశంకర్‌కు ఏడో స్థానం
పురుషుల లాంగ్‌జంప్‌ ఫైనల్లో భారత ప్లేయర్‌ మురళీ శ్రీశంకర్‌ 7.96 మీటర్ల దూరం దూకి ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.


National Junior Swimming Championshipలో తెలంగాణకు స్వర్ణం 

ఒడిశాలోని భువనేశ్వర్ లో జరుగుతున్న జాతీయ జూనియర్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్‌ వ్రితి అగర్వాల్‌ స్వర్ణ, రజత పతకాలతో మెరిసింది. అండర్‌–17 బాలికల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ విభాగంలో వ్రితి పసిడి పతకం (2ని:22.16 సెకన్లు) నెగ్గగా... 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో రజత పతకం (4ని:29.37 సెకన్లు) గెలిచింది.

UBS CEOగా భారత–అమెరికన్‌ నౌరీన్‌(Naureen Hassan) 

ప్రఖ్యాత ఆర్థిక సేవల సంస్థ యూబీఎస్‌ అమెరికా అధ్యక్షురాలిగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంకు యూబీఎస్‌ అమెరికా హోల్డింగ్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా(సీజీవో) భారత–అమెరికన్‌ నౌరీన్‌ హసన్‌ నియమితులు కానున్నారు. ఆమె ప్రస్తుతం ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ ఉపాధ్యక్షురాలిగా, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. 

Also read: Femina Miss India 2022: ఫెమినా మిస్‌ ఇండియా 2022గా సినీశెట్టి

Singapore Open 2022: సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ విజేత పీవీ సింధు

2022లో తన నిలకడైన ఆటతీరును కొనసాగిస్తూ భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. జూలై 17న ముగిసిన సింగపూర్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీలో సింధు చాంపియన్‌గా అవతరించింది. 58 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సింధు 21–9, 11–21, 21–15తో ప్రపంచ 11వ ర్యాంకర్‌ ఆసియా చాంపియన్‌ వాంగ్‌ జి యి (చైనా)పై విజయం సాధించింది. ఈ ఏడాది స్విస్‌ ఓపెన్, సయ్యద్‌ మోడీ ఓపెన్‌ టైటిల్స్‌ నెగ్గిన సింధు తాజా విజయంతో తన ఖాతాలో మూడో టైటిల్‌ను జమ చేసుకుంది. 

Also read: Weekly Current Affairs (Sports) Bitbank: రెడ్ బుల్‌లో స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్‌ను ఎవరు గెలుచుకున్నారు

    విజేత సింధుకు 27,750 డాలర్ల (రూ. 22 లక్షల 13 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9,200 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. గతంలో ఐదుసార్లు సింగపూర్‌ ఓపెన్‌ టోర్నీలో పాల్గొన్న సింధు ఒక్కోసారి తొలి రౌండ్‌లో, ప్రిక్వార్టర్‌ ఫైనల్లో... రెండుసార్లు క్వార్టర్‌ ఫైనల్లో, ఒకసారి సెమీఫైనల్లో నిష్క్రమించి ఆరో ప్రయత్నంలో టైటిల్‌ను దక్కించుకుంది. తద్వారా ఈ టైటిల్ నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్‌ గా  సింధు నిలిచింది. గతంలో మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ (2010), పురుషుల సింగిల్స్‌లో భమిడిపాటి సాయిప్రణీత్‌ (2017) ఈ ఘనత సాధించారు.

Andhra pradesh: పశ్చిమ ఆస్ట్రేలియాతో ఏపీ వ్యూహాత్మక ఒప్పందం  

అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌.. పెట్టుబడులకు స్వర్గధామంగా ఉందని ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఐటీ–పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఆ్రస్టేలియా (డబ్ల్యూఏ) మధ్య పెట్టుబడులే లక్ష్యంగా విశాఖ నగరంలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో ‘వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు’జూలై 16న జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు బుగ్గన, గుడివాడ హాజరుకాగా.. పశ్చిమ ఆ్రస్టేలియా తరఫున డిప్యూటీ ప్రీమియర్‌ రోజర్‌ కుక్, అంతర్జాతీయ విద్య, కల్చరల్‌ మంత్రి డేవిడ్‌ టెంపుల్టన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్‌ని సిస్టర్‌ స్టేట్‌గా గుర్తించడంతోపాటు ఈ బంధాన్ని మరింత బలోపేతం చేయడం.. పెట్టుబడులు పెట్టేందుకు సాంకేతిక సహకారం, నైపుణ్యం అందించే అంశాలపై ఇరు ప్రాంతాల ప్రతినిధులు చర్చించారు. అనంతరం జరిగిన వ్యూహాత్మక సదస్సులో పలు అంశాలపై పరస్పర అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ)లు కుదుర్చుకున్నారు. ఏపీలో గనులు, ఖనిజాలు, విద్య, నైపుణ్యం, విద్యుత్, పరిశ్రమలు, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి, సాంకేతిక సహకారం, నైపుణ్యాలు అందించేందుకు పశ్చిమ ఆ్రస్టేలియా ముందుకొచ్చింది. ఎనిమిది అంశాలపై రోజర్‌ కుక్‌ సారథ్యంలో ఆ రాష్ట్ర ప్రతినిధి బృందం.. ఏపీ మంత్రుల సమక్షంలో ఎంఓయూలపై సంతకాలు చేశారు. 

Also read: I2I2: ‘ఐ2యూ2’ సానుకూల అజెండా.. భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు..

International Shooting Federation: ఐశ్వరి ప్రతాప్‌కు స్వర్ణం

దక్షిణ కొరియాలోని చాంగ్వాన్‌ లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్‌ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచకప్‌లో భారత్‌ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది. 50 మీటర్ల రైఫిల్‌ త్రి పొజిషన్‌లో ఐశ్వరి ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ పసిడి పతకం సాధించాడు. జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌ అయిన ప్రతాప్‌కు సీనియర్‌ స్థాయిలో ఇది రెండో స్వర్ణం. గతేడాది న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచకప్‌లోనూ ఈ మధ్యప్రదేశ్‌ షూటర్‌ విజేతగా నిలిచాడు. పురుషుల ఈవెంట్‌లో శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో 52 మంది తలపడగా... ప్రతాప్‌ సింగ్‌ 593 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. మరో ఇద్దరు భారత షూటర్లు చైన్‌ సింగ్‌ (586), సంజీవ్‌ రాజ్‌పుత్‌ (577)లు కూడా పోటీపడినప్పటికీ పతకం బరిలో నిలువలేకపోయారు. 

Also read: National Junior Swimming Championshipలో తెలంగాణకు స్వర్ణం

Athlete Allyson Felix's: అమెరికన్‌ అథ్లెటిక్‌ ఫెలిక్స్‌ @ 30  పతకాలు



మేజర్‌ ఈవెంట్స్‌ (ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్‌)లో 30 పతకాలు సాధించడం అనేది అతికష్టమైన పని. ఈ పనిని తన ఆఖరి ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో అమెరికన్‌ అథ్లెటిక్‌ దిగ్గజం అలిసన్‌ ఫెలిక్స్‌ పూర్తి చేసింది. జూలై 16న జరిగిన 4X400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలేలో 36 ఏళ్ల ఫెలిక్స్‌ కాంస్య పతకం సాధించింది. సాధారణంగా మహిళల 200 మీ, 400 మీ., 4X100 మీ, 4X400 మీ. పరుగులో పోటీ పడే ఆమె ఈ సారి మిక్స్‌డ్‌ రిలేలోనే అర్హత పొందింది. పాల్గొన్న ఏకైక ఈవెంట్‌ను పతకంతో ముగించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆమెకిది 19వ పతకం. ఇందులో 13 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలున్నాయి. ఒలింపిక్స్‌లో మరో 11 (7 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యం) పతకాలు సాధించిన ఆల్‌ టైమ్‌ గ్రేటెస్ట్‌ అథ్లెట్‌ ఫెలిక్స్‌. 2001 నుంచి 21 ఏళ్లుగా ఆమె ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో పరుగుల చిరుతగా ఖ్యాతికెక్కింది. ప్రపంచ యూత్, ప్రపంచ జూనియర్, ప్రపంచ ఇండోర్, పాన్‌ అమెరికా గేమ్స్, వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఫైనల్, డైమండ్‌ లీగ్స్‌ ఇలా ఆమె పాల్గొన్న పోటీల చిట్టా చెబితే పతకాలు అర్ధసెంచరీకి పైనే ఉంటాయి.

Also read: Singapore Open 2022: సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ విజేత పీవీ సింధు

Published date : 18 Jul 2022 07:02PM

Photo Stories