Gotabaya Rajapaksa : శ్రీలంక అధ్యక్షుడు గొటబయా రాజపక్స రాజీనామా.. కారణం ఇదే..?
రాజీనామా లేఖను జూలై 14వ తేదీన (గురువారం) శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ మహిందా అబేయవర్దనేకు పంపించారు. సింగపూర్‌లోని శ్రీలంక హైకమిషన్ నుంచి లేఖ అందిందని స్పీకర్ మీడియా కార్యదర్శి ప్రకటించారు. గొటబయా రాజీనామా లేఖను పరిశీలించి, జూలై 15వ తేదీన(శుక్రవారం) అధికారికంగా ప్రటించాలని స్పీకర్ నిర్ణయించారు. లేఖపై ఉన్న సంతకం గొటబయాదేనా? కాదా? అనేది నిర్ధారించుకోవాలని స్పీకర్ భావిస్తున్నట్లు సమాచారం. ఒరిజినల్ లేఖను దౌత్య అధికారి ద్వారా సింగపూర్ నుంచి కొలంబోకు విమానంలో తీసుకురానున్నారు.
గొటబయా ‘ప్రైవేట్ సందర్శన’ ..
గొటబయా మాల్దీవుల నుంచి సింగపూర్‌కు పయనమయ్యారు. సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎస్‌వీ 788 విమానంలో స్థానిక కాలమానం ప్రకారం జూలై 14వ తేదీన (గురువారం) సాయంత్రం ఏడింటికి సింగపూర్‌లోని చాంగీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ‘ప్రైవేట్ సందర్శన’ కింద గొటబయాను తమ దేశంలోకి అనుమతించినట్లు సింగపూర్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. బుధవారం రాజీనామా చేస్తానని హామీ ఇచ్చిన గొటబయా మాట నిలబెట్టుకోకుండానే తన భార్య, పరివారంతో కలిసి మాల్దీవులకు పారిపోవడం తెల్సిందే. శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘేను నియమిస్తూ గెజిట్ జారీ చేశారు.
చదవండి: Quiz of The Day(July 14, 2022) >> ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయాలు, ఎన్నికలలో పాల్గొనడాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది?
శ్రీలంక రాజ్యాంగం ప్రకారం..
ప్రజల డిమాండ్‌ను అంగీకరిస్తూ ప్రధానిగా తప్పుకుంటానని విక్రమసింఘే ఇప్పటికే ప్రకటించారు. అధ్యక్షుడు, ప్రధాని రాజీనామాల తర్వాత అఖిలపక్ష మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం పార్లమెంట్‌ను సమావేశపర్చనున్నారు. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేస్తే పార్లమెంట్ స్పీకర్ గరిష్టంగా 30 రోజులు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉండొచ్చు. తాము దేశం విడిచి వెళ్లబోమని మహిందా రాజపక్స, బసిల్ రాజపక్స తమ లాయర్ల ద్వారా గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. వారికి వ్యతిరేకంగా దాఖలైన మానవ హక్కుల పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది.
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్