Daily Current Affairs in Telugu: 27 జులై 2023 కరెంట్ అఫైర్స్
1. వీసా లేకుండా భారత పాస్‌పోర్టుతో 57 దేశాలకు వెళ్లిపోవచ్చు. తాజాగా లండన్‌కు చెందిన హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకుల్లో భారత్ 80వ స్థానంలో నిలిచింది.
2. దేశంలో మహిళల మిస్సింగ్‌లో మహారాష్ట్ర టాప్ ఉందని రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా గణాంకాలను లిఖిత పూర్వకంగా ఇచ్చారు.
3. మహారాష్ట్రకు చెందిన ఆదిత్య సామంత్ భారత చెస్‌లో 83వ గ్రాండ్‌మాస్టర్ (జీఎం)గా అవతరించాడు.
☛☛Daily Current Affairs in Telugu: 26 జులై 2023 కరెంట్ అఫైర్స్
4. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా కేంద్రాలు అమలులో ఉన్నట్టు కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
5. ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్ మంజూరైందని కేంద్ర వాణిజ్యశాఖ సహాయ మంత్రి సోమ్‌ప్రకాశ్ తెలిపారు.
6. దేశీయంగా ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు సంబంధించి ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు గోద్రెజ్ ఆగ్రోవెట్ ఎండీ బలరాం సింగ్ యాదవ్ తెలిపారు.
7. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 24 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం దేశమంతా విజయ్ దివస్ జరుపుకుంది.
☛☛Daily Current Affairs in Telugu: 25 జులై 2023 కరెంట్ అఫైర్స్