Daily Current Affairs in Telugu: 26 జులై 2023 కరెంట్ అఫైర్స్
1. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,719 కోట్లతో తలపెట్టిన 11 ఆహారశుద్ధి ప్రాజెక్టులను మంగళవారం ఉదయం వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
2. కాలువల ద్వారా పోర్టులకు సరుకు రవాణా అంతర్గత జలరవాణా చేపట్టడానికి ఏపీ ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ అడుగులు వేస్తోంది.
3. జులై 19వ తేదీన కాలిఫోర్నియా వండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ ప్రయోగించిన ఫాల్కన్-9 రాకెట్ వల్ల భూమి చుట్టూ ఉన్న వాతావరణ పొర అయనోస్పియర్‌కి రంధ్రం ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
☛☛ Daily Current Affairs in Telugu: 25 జులై 2023 కరెంట్ అఫైర్స్
4. సాగరమాల ప్రోగ్రాం కింద ఆంధ్రప్రదేశ్‌లో లక్షా 20 వేల కోట్ల రూపాయలతో 113 ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్ శాఖ మంత్రి సర్భానంద సోనోవాల్ పేర్కొన్నారు.
5. ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీల్లో మ్యాచ్ ఆడిన అతి పిన్న వయస్కురాలిగా దక్షిణ కొరియా అమ్మాయి కేసీ పెయిర్ (16 ఏళ్ల 26 రోజులు) రికార్డు సృష్టించింది.
6. నాగాలాండ్ నుంచి మొదటి మహిళా సభ్యురాలుగా ఫాంగ్నోన్ కొన్యాక్ రాజ్యసభలో అధ్యక్షత వహించారు.
☛☛ Daily Current Affairs in Telugu: 24 జులై 2023 కరెంట్ అఫైర్స్..