కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 24 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం దేశమంతా విజయ్ దివస్ జరుపుకుంది.
Kargil Vijay Diwas
ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాది దాటినా ఇంకా యుద్ధం కొనసాగుతోందని అంటే పౌరులు భాగస్వాములు కావడం వల్లేనని అభిప్రాయపడ్డారు.
‘‘మన దేశంలో యుద్ధం పరిస్థితులు వస్తే సైనిక బలగాలకు ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు. పరోక్షంగా తమ సహకారాన్ని అందిస్తారు. ఈ సారి అవసరమైతే ప్రత్యక్షంగా యుద్ధభూమిలో పాల్గొనాలని, దానికి తగ్గట్టు మానసికంగా సంసిద్ధులు కావాలని కోరుతున్నాను’’ అని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలను కాపాడుకునే అంశంలో మన సైన్యం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కార్గిల్ యుద్ధం సమయంలో భారత ఆర్మీ పాకిస్తాన్‌కేకాక యావత్ ప్రపంచానికి సందేశం పంపించిందన్నారు.