Daily Current Affairs in Telugu: 25 జులై 2023 కరెంట్ అఫైర్స్
1. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌ను నియమించాలన్న సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు.
2. ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ పరిధిలో పేదలకు 50,793 ఇళ్ల నిర్మాణం, 45 సామాజిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన సీఎం జగన్.
3. వివాదాస్పద న్యాయ వ్యవస్థ సంస్కరణల బిల్లును ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదించింది.
☛☛ Daily Current Affairs in Telugu: 24 జులై 2023 కరెంట్ అఫైర్స్..
4. ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీలను భారత షూటర్లు కమల్‌జీత్, టియానా పసిడి పతకాలతో ముగించారు.
5. చైనాలోని హాంగ్జౌలో జరుగునున్న ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో భారత సాఫ్ట్‌బాల్ జట్టులో తెలంగాణ అమ్మాయి మమత గుగులోత్‌కు చోటు దక్కింది.
6. విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు.
☛☛ Daily Current Affairs in Telugu: 22 జులై 2023 కరెంట్ అఫైర్స్
7. సృష్టి సుధీర్ జగ్‌తాప్ విరామం లేకుండా 127 గంటల సేపు నాట్యం చేసి లాంగెస్ట్ డాన్స్ మారథాన్ (ఇండివిడ్యుయల్ కేటగిరీ)లో గిన్నిస్ రికార్డు సాధించింది.
8. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది.
☛☛ Daily Current Affairs in Telugu: 21 జులై 2023 కరెంట్ అఫైర్స్