AP High Court CJ: ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్
ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని జూలై 5న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ఠాకూర్ ప్రస్తుతం బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు.
☛☛ Telangana High Court CJ: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్
1964 ఏప్రిల్ 25న జమ్మూకశ్మీర్‌లో జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ జన్మించారు. 1989 అక్టోబర్ 18న దిల్లీ, జమ్మూకశ్మీర్ బార్‌కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదుచేసుకున్నారు. 2011లో సీనియర్ అడ్వొకేట్‌గా పదోన్నతి పొందారు. 2013 మార్చి 8న జమ్మూకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.2022 జూన్ 10న బాంబే హైకోర్టుకు బదిలీ అయి ప్రస్తుతం అక్కడే సేవలందిస్తున్నారు. గత ఫిబ్రవరి 9న కొలీజియం ఠాకూర్‌ను మణిపుర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సిఫార్సు చేసినా అది పెండింగ్‌లో ఉండటంతో కొలీజియం ఆ సిఫార్సును రద్దు చేసి, ఈ నెల 5న ఆయన్ను ఏపీ హైకోర్టు సీజేగా నియమించాలని నిర్ణయించింది.
☛☛ Daily Current Affairs in Telugu: 24 జులై 2023 కరెంట్ అఫైర్స్