Daily Current Affairs in Telugu: 24 జులై 2023 కరెంట్ అఫైర్స్..
1. పేదలకు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించే విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.మన రాష్ట్రం తర్వాత తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి
2. పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రి ఇషాఖ్ దార్ (73) పేరును అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ పార్టీ ప్రతిపాదించింది.
3. ట్విట్టర్‌ను ‘ఎక్స్’ యాప్‌గా రీబ్రాండ్ చేయనున్నట్లు ఎలాన్ మస్క్ స్వయంగా ప్రకటించారు.
☛☛ Daily Current Affairs in Telugu: 22 జులై 2023 కరెంట్ అఫైర్స్
4. రాజస్తాన్‌లో మృతదేహాలతో చేసే ధర్నాలు అడ్డుకట్ట వేయడానికి ‘ది రాజస్థాన్ ఆనర్ ఆఫ్ డెడ్ బాడీ బిల్లు, 2023’కు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది.
5. కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ చాంపియన్‌గా అవతరించింది.
6. ప్రపంచంలో బెస్ట్ స్టూడెంట్ ఫ్రెండ్లీ సిటీగా బ్రిటన్ రాజధాని నగరం అయిన లండన్ నిలిచింది.
7. భారత సంతతికి చెందిన ఏడు సంవత్సరాల బ్రిటన్ బాలిక మోక్షారాయ్ ప్రతిష్టాత్మక బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డును గెలుచుకుంది.
8. పిల్లలు అదృశ్యంలో కర్ణాటక మూడోస్థానంలో నిలిచింది. కర్ణాటక రాష్ట్రంలో 27,528 పిల్లలు అదృశ్యమైనట్లు కేంద్ర మహిళా శిశుసంక్షేమాభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోకసభలో వెల్లడించారు.
☛☛ Daily Current Affairs in Telugu: 21 జులై 2023 కరెంట్ అఫైర్స్