Skip to main content

Student Friendly cities: స్టూడెంట్‌ ఫ్రెండ్లీ సిటీగా లండన్‌

ప్రపంచంలో అన్నింటికంటే బెస్ట్‌ స్టూడెంట్‌ ఫ్రెండ్లీ సిటీగా బ్రిటన్‌ రాజధాని నగరం అయిన లండన్‌ నిలిచింది.
london
london

క్వాక్‌క్వారెల్లీ సైమండ్స్‌ అనే సంస్థ 2024 సంవత్సరానికి సంబంధించిన స్టూడెంట్‌ ఫ్రెండ్లీ సిటీల జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా లండన్‌ నగరానికి అగ్ర స్థానం దక్కింది. ఆ తర్వాత జపాన్‌  రాజధాని టోక్యో, దక్షిణ కొరియా రాజధాని సియోల్, ఆస్ట్రేలియాకు చెందిన మెల్‌బోర్న్, జర్మనీలోని మ్యూనిచ్‌ నగరాలు వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. టోక్యో 2023 జాబితాలో ఏడో స్థానంలో ఉండగా.. ఈసారి ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని సెకండ్‌ ప్లేస్‌లో నిలిచింది. ఇక మన దేశం విషయానికి వస్తే మహారాష్ట్ర రాజధాని ముంబైకి 2024 స్టూడెంట్‌ ఫ్రెండ్లీ నగరాల జాబితాలో 118వ ర్యాంకు దక్కింది. అదేవిధంగా దేశంలో నెంబర్‌ 1 స్టూడెంట్‌ ఫ్రెండ్లీ నగరంగా కూడా ముంబై నిలిచింది. అదేవిధంగా భారత రాజధాని ఢిల్లీకి 132వ ర్యాంకు, కర్ణాటక రాజధాని బెంగళూరు నగరానికి 147వ ర్యాంకు, తమిళనాడు రాజధాని చెన్నైకి 151వ ర్యాంకు దక్కాయి.

☛☛  US H1B visa: ఇక‌పై ఎవ‌రైనా కెన‌డాలో ఉద్యోగం చేసుకోవ‌చ్చు... అయితే ఈ వీసా ఉంటేనే

Published date : 24 Jul 2023 05:28PM

Photo Stories