Skip to main content

US H1B visa: ఇక‌పై ఎవ‌రైనా కెన‌డాలో ఉద్యోగం చేసుకోవ‌చ్చు... అయితే ఈ వీసా ఉంటేనే

అమెరికా హెచ్-1 బి వీసాదారులకు కెనడా శుభవార్త వెల్లడించింది. హెచ్-1 బీ వీసాదారులు ఇకపై కెనడాలో కూడా పనిచేయవచ్చని తాజాగా ప్రకటించింది. అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులను ఆకర్షించేందుకు యూఎస్‌ హెచ్-1 వీసా హోల్డర్లకు ఓపెన్ వర్క్ పర్మిట్లను ఇవ్వడం ప్రారంభించింది.
US H1B visa

దీని ద్వారా అమెరికాలో ఉన్న 75 శాతం భారత హెచ్-1బీ వీసాదారులకు ప్రయోజనం చేకూరనుంది.  

ఈ కొత్త పథకం ద్వారా కెనడా ప్రభుత్వం10వేల మంది దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ వీసా హోల్డర్లు కెనడాలో మూడు సంవత్సరాల పాటు పని చేయడానికి  అనుమతిస్తుంది. ఈ వీసా హోల్డర్ల కుటుంబ సభ్యుల చదువుకోవచ్చు లేదా దేశంలో పని  చేసుకోవచ్చు. ఇందుకు తాత్కాలిక నివాస వీసా, వర్క్ లేదా స్టడీ పర్మిట్‌  లభిస్తుందని పేర్కొంది. ఇప్పటిదాకా యూఎస్‌లో పని చేసే హెచ్-1 బీ హోల్డర్లు   స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసాను ఉపయోగించేవారు.

ఎమోజీల‌తో య‌మ డేంజ‌ర్‌... ఈ ఎమోజీల‌ను పంపిస్తే కోర్టు కేసుల్లో అడ్డంగా బుక్క‌యిన‌ట్లే.....

H-1B visa

కాగా 2023 వసంవత్సరం జులై 16వతేదీ నాటికి హెచ్1 బి వీసా హోల్డర్‌లు, వారితో పాటు కుటుంబ సభ్యులు కెనడాకు రావడానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని కెనడా ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. టెక్‌ కంపెనీలు ఇండియా, చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం పదివేల ఉద్యోగులను నియమించు కుంటాయి. 

Inspirational Story: క‌ళ్లులేవ‌ని వెక్కిరించారు... లెక్క‌చేయ‌క ల‌క్ష్యాన్ని చేరుకుని ఆద‌ర్శంగా నిలుస్తున్నారిలా...

Published date : 18 Jul 2023 03:42PM

Photo Stories