Skip to main content

Korea Open 2023: కొరియా ఓపెన్‌ టైటిల్ విజేతగా సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

ఈ ఏడాది తమ అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తూ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ తమ ఖాతాలో నాలుగో టైటిల్‌ను జమ చేసుకుంది.
Korea Open 2023
Korea Open 2023

కొరియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీలో ప్రపంచ మూడో ర్యాంక్‌ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంట 17–21, 21–13, 21–14తో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ జోడీ ఫజర్‌ అల్ఫీయాన్‌–మొహమ్మద్‌ రియాన్‌ అర్దియాంతో (ఇండోనేసియా)పై అద్భుత విజయం సాధించింది.
విజేతగా నిలిచిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి 33,180 డాలర్ల (రూ. 27 లక్షల 20 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

☛☛ Satwik smashes Guinness world record: ‘గిన్నిస్‌’లోకి సాత్విక్‌ స్మాష్‌...

Published date : 24 Jul 2023 04:02PM

Photo Stories