Child Missing Report: పిల్లల అదృశ్యంలో కర్ణాటక మూడో స్థానం
రాష్ట్రంలో 27,528 పిల్లలు అదృశ్యమైనట్లు కేంద్ర మహిళా శిశుసంక్షేమాభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోకసభలో వెల్లడించారు. 2018 జనవరి 1 నుంచి 2023 జూన్ 30 వరకు దేశంలో 2.12 లక్షలమంది ఆడపిల్లలు అదృశ్యం కాగా మగపిల్లలు 62 వేలమంది ఉన్నారు. ఇదే అవధిలో 1.73 లక్షల మంది యువతులు, 66 వేలమంది యువకులతో కలిసి 2.4 లక్షలమందిని రక్షించామని తెలిపారు.వీరిలో 2018 కంటే ముందు అదృశ్యమైనపిల్లలు ఉన్నారని తెలిపారు. కర్ణాటకలో 8,632 బాలురు, 18,893 బాలికలు అదృశ్యయ్యారు. ఇదే సమయంలో 7,163 బాలురు, 14,649 బాలికలతో కలిపి మొత్తం 21,817 మంది రక్షించామన్నారు. పిల్లల ఆచూకీ కోసం మహిళా శిశుసంక్షేమాబివృద్ధి శాఖ ట్రాక్ చైల్డ్ పోర్టల్ అభివృద్ధి చేసింది.
మధ్యప్రదేశ్ మొదటి స్థానం:
పిల్లల అదృశ్యంలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో( 61,102), పశ్చిమబెంగాల్( 49,129) రెండో స్థానంలో నిలిచింది.
☛☛ India's Rice Exports Ban: బియ్యం ఎగుమతులను నిషేధించిన భారత్