CRDA Houses foundation stone: సీఆర్డీఏలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన
సీఆర్డీఏలో 50,793 మంది అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలిచ్చాం. ఈ రోజు గృహ నిర్మాణాలను ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని అత్యధికంగా ఆప్షన్–3 ఎంపిక చేసుకున్నారు. వారి నిర్ణయానికి అనుగుణంగా మన ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తోంది. సీఆర్డీఏ ప్రాంతంలో గజం స్థలం కనీసం రూ.15 వేలు ఉంది.ఈ లెక్కన పేద మహిళలకు ఇచ్చిన స్థలం విలువే రూ.7.50 లక్షలు ఉంటుంది. మరో రూ.2.70 లక్షలు వెచ్చించి ఇళ్లను నిర్మిస్తున్నాం. మౌలిక వసతుల కోసం ప్రతి ఇంటి మీద మరో రూ.లక్ష పైచిలుకు ఖర్చు చేస్తున్నాం. ఇంటి నిర్మాణం పూర్తయ్యే సరికి ఈ ఆస్తి విలువ కనీసం రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు పలుకుతుంది.
☛☛ YSR Netanna Nestam: తిరుపతి వెంకటగిరిలో వైఎస్సార్ నేతన్న నేస్తం
అన్ని సదుపాయాలతో..
మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో 1,400 ఎకరాల్లో 25 లేఅవుట్లను అభివృద్ధి చేసి 50,793 మంది పేదలకు ఇళ్ల స్థలాలతోపాటు ఇళ్లను నిర్మించే బాధ్యత తీసుకుంటున్నాం. ప్రతి లేఅవుట్ వద్దకు అక్కచెల్లెమ్మలను తీసుకుని వెళ్లి ఇళ్ల పత్రాలిచ్చి ఆ ఇంటి స్థలంలో ఫొటోలు తీసి జియో ట్యాగింగ్ చేశాం. సీఆర్డీఏ పరిధిలో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షలు ఖర్చు చేస్తున్నాం. లేఅవుట్ల అభివృద్ధిలో భాగంగా ల్యాండ్ లెవలింగ్, ప్లాట్ల సరిహద్దు రాళ్లు కూడా పాతాం. దీనికోసం ఇప్పటికే రూ.56 కోట్లు ఖర్చు చేశాం.
☛☛ Jagananna Thodu: చిరు వ్యాపారులకు జగనన్న తోడు
ఇళ్ల నిర్మాణం కోసం రూ.1,370 కోట్లు ఖర్చు చేస్తున్నాం. లేఅవుట్‌లలో నీటి సరఫరా కోసం రూ.32 కోట్లతో టెండర్లు ఖరారయ్యాయి. విద్యుత్ కనెక్షన్ కోసం రూ. 326 కోట్లు, అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి మరో రూ.8 కోట్లతో పనులకు శ్రీకారం చుడుతున్నాం. పేదల ఇళ్లు నిర్మించే కాలనీల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూళ్లు, షాపింగ్‌మాల్స్, పార్కులు వస్తాయి. మిమ్మల్నందరినీ ఆయా సచివాలయాల సిబ్బంది, వలంటీర్లతో మ్యాపింగ్ చేశారు. కౌంటర్లలో మీ ఇంటికి సంబంధించిన పత్రాలు మీ చేతుల్లో పెడతారు. ఇందుకోసం 25 కౌంటర్లు ఏర్పాటు చేశాం అని తెలిపారు.
☛☛ Animal Health Leadership Award: ఏపీకి యానిమల్ హెల్త్ లీడర్‌షిప్ అవార్డు