Indian women’s softball team: భారత సాఫ్ట్‌బాల్ జట్టులో తెలంగాణ అమ్మాయి
16 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి మమత గుగులోత్‌కు చోటు దక్కింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మమత గత ఎనిమిదేళ్లుగా జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోంది.
☛☛ ISSF World Junior Shooting Championships: ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ జోరు
అండర్–14, అండర్–17, అండర్–19 వయో విభాగాల్లో కలిపి మొత్తం 18 సార్లు జాతీయ పోటీల్లో పాల్గొన్న ఆమె పలుమార్లు ‘ఉత్తమ క్యాచర్’గా అవార్డులు అందుకుందని తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి కె. శోభన్ బాబు తెలిపారు. నిజామాబాద్ సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ స్పోర్ట్స్ అకాడమీలో నీరజ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న మమత ప్రస్తుతం భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత జట్టు రెగ్యులర్ గా పోటీపడుతుండటంతో ఆసియా సాఫ్ట్‌బాల్ సంఘం భారత జట్టుకు వైల్డ్ కార్డు ఎంట్రీ కేటాయించింది.
☛☛ Asian Schools Chess Championship 2023: ఆసియా స్కూల్స్ చెస్ చాంపియన్‌షిప్–2023