Skip to main content

Corona: బూస్టర్‌ డోసు తీసుకోవాల్సిందే

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ఈసీఎంఆర్‌ మాజీ సైంటిస్ట్‌ డాక్టర్ రమన్ గంగాఖేడ్కర్ కీలక విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్ ముగింపు దశకు చేరుకుందని, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికావాల్సిన అవసరంలేదని చెప్పారు. అయితే వైరస్‌ను నిర్లక్ష‍్యం చేయకుండా జాగ్రత్తలు మాత్రం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
Corona
Corona

కరోనా వైరస్ వివిధ రకాలుగా రూపాంతరం చెంది(మ్యుటేషన్లు) బలహీన పడుతోందని డా.గంగాఖేడ్కర్ పేర్కొన్నారు. ఇప్పుడు వైరస్ సోకిన వారికి స్వల్ప లక్షణాలే కన్పిస్తున్నాయని, తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాల్సిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయన్నారు. మ‌రి కొన్ని మ్యూటేషన్ల త‌ర్వాత‌ కరోనా పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

చ‌ద‌వండి: ఆ మూడు పార్టీల‌కు ఈసీ షాక్‌... ఇన్ని సీట్లు వ‌స్తేనే జాతీయ హోదా.!​​​​​​​
ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌పై...

ఈ ఏడాది జనవరిలో తొలిసారి వెలుగుచూసిన ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ ప్రమాదకరం కాదని గంగాఖేడ్కర్ తెలిపారు. గత మూడు నెలల్లో దేశంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదుకాకపోవడమే ఇందుకు నిదర్శనమ‌న్నారు. ''XBB.1.16 అనేది రీకాంబినెంట్ వైరస్. ఇది మానవ శరీరంలో అనుకోకుండా తయారవుతుంది. రెండు వేర్వేరు వేరియంట్లు మానవ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, పునరుత్పత్తి సమయంలో జన్యు పదార్ధం మిక్స్అప్ అయినప్పుడు అవి తయారవుతాయి'' అని ఆయన వివరించారు.

చ‌ద‌వండి:​​​​​​​ ప‌ది, డిప్లొమా అర్హ‌త‌తో ఇస్రోలో ఉద్యోగాలు... పూర్తి వివ‌రాలు ఇవే
బూస్టర్ డోసులు, మాస్కులు...
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నందున ఇంకా బూస్టర్ డోసు టీకా తీసుకోని వారు, ఆలస్యం చేసిన వారు వెంటనే తీసుకోవాలని డాక్టర్ సూచించారు. అలాగే ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. పిల్లలు అనారోగ్యానికి గురైతే వాళ్లను స్కూళ్లకు పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఒకవేళ వారికి సోకింది కరోనా అయితే అది ఇతర విద్యార్థులకు, టీచర్లకు, సిబ్బంది సోకి మరింత మందికి వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు.

Published date : 11 Apr 2023 02:48PM

Photo Stories