Project Tiger: ఐదేళ్లలో పులుల సంఖ్య రెట్టింపు.. దేశంలో ఎన్ని పులులున్నాయో తెలిపిన మోదీ
Sakshi Education
ప్రాజెక్ట్ టైగర్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో పులుల సంఖ్యను ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. గత నాలుగేళ్లలో పులుస సంఖ్య 200కి పెరిగినట్లు తెలిపారు. తాజా గణాంకాల ప్రకారం 2022 నాటికి దేశంలో పులుల సంఖ్య 3,167గా ఉంది.
2018లో పులుల గణన చేపట్టినప్పుడు ఈ సంఖ్య 2,967 గా ఉంది. 2014లో 2,226 పులులు, 2010లో 1,706 పులులు, 2006లో 1,411 పులులు ఉన్నాయి. గత 16 ఏళ్లగా దేశంలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతూ.. రెట్టింపయ్యింది. కాగా.. ఆదివారం కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్, తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్ కేంద్రాలను మోదీ సందర్శించారు. అడవిలో కలియతిరుగుతూ అక్కడున్న జంతువులు, పశువులను బైనాక్యులర్స్‌తో వీక్షించారు.
చదవండి: మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే... అప్రమత్తమైన రాష్ట్రాలు
చదవండి: ఇకపై 24 గంటలూ షాప్‌లు తెరుచుకోవచ్చు.. కానీ, ఈ నిబంధనలు పాటించాల్సిందే
Published date : 09 Apr 2023 06:13PM