Covid: మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే... అప్రమత్తమైన రాష్ట్రాలు
అలాగే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర సేవలను అంచనా వేయడానికి సోమవారం, మంగళవారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేపట్టాలని స్పష్టం చేశారు. ఐసీయూలో పడకలు, ఆక్సిజన్ సరఫరా, ఇతర సంరక్షణ ఏర్పాట్లపై సమీక్షించుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.
చదవండి: TS SI Final Exam General Studies Question Paper.. ప్రశ్నలు ఎలా వచ్చాయంటే..
హర్యానా
కోవిడ్ కేసుల నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. కరోనా పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలు మాస్కులు ధరించేలా చూడాలని జిల్లా అధికార యంత్రాంగం, పంచాయతీలకు ఆదేశాలు జారీ చేసింది.
కేరళ
గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి, ఈ నిర్ణయం తీసుకున్నారు.
చదవండి: ఇకపై 24 గంటలూ షాప్‌లు తెరుచుకోవచ్చు.. కానీ, ఈ నిబంధనలు పాటించాల్సిందే
పుదుచ్చేరి
పుదుచ్చేరి ప్రభత్వుం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఆసుపత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, వినోద రంగాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఒక ప్రకటనలో ఆదేశించింది.