Karnataka Assembly election 2023: బీజేపీ కొంప ముంచిన "గాలి"
కర్నాటకలో బీజేపీని ఆ పార్టీ మాజీ నాయకుడు, కల్యాణ రాజ్య ప్రగతి పక్ష అధ్యక్షుడు గాలి జనార్దన్‌రెడ్డి ముప్పుతిప్పలు పెట్టాడు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ముఖ్య భూమిక పోషించారు. ఉత్తర కర్నాటకలో కాంగ్రెస్ హవాకు గాలి జనార్దన్‌రెడ్డి కూడా దోహదపడ్డారని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలో బీజేపీ ఓట్లను భారీగా చీల్చడంతో అది కాంగ్రెస్‌కు ప్లస్ అయ్యింది. గాలి సారథ్యంలోని కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ మొత్తం 47 స్థానాల్లో పోటీ చేసింది. ఆయన పార్టీ గుర్తు ఫుట్‌బాల్.
Karnataka: కర్నాటక ముఖ్యమంత్రి ఈయనే...?
దాదాపు 20 నియోజకవర్గాల్లో జనార్దన్‌రెడ్డి పార్టీ బీజేపీ కంటే మెరుగ్గా, కొన్ని చోట్ల పోటాపోటీగా ఓట్లు సాధించింది. దీంతో బీజేపీ ఓట్లను జనార్దన్‌రెడ్డి బాగా చీల్చినట్లైంది. బళ్లారిలో అడుగు పెట్టవద్దని సుప్రీం కోర్టు ఆదేశించడంతో గంగావతిలో జనార్దన్‌రెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీల అభ్యర్థులను మట్టి కరిపించి జనార్దన్‌రెడ్డి రెండు వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
జనార్దన్‌రెడ్డి భార్య లక్ష్మీ అరుణ బళ్లారి నుంచి బరిలో దిగారు. ఈమె కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్‌రెడ్డికి గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు. 8 ఏళ్ల తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన గాలి జనార్దన్‌రెడ్డి తనను అందరూ ఫుట్‌బాల్‌లా ఆడుకున్నారనీ, తాను కూడా అదే ఆట ఆడుకుంటానని బహిరంగంగా ప్రకటించారు. అతను సవాల్ విసిరినట్టే బీజేపీని ఫుట్‌బాల్ ఆడుకున్నారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించిన ఆరు హామీలు ఇవే..
గాలి జనార్దన్‌రెడ్డి పార్టీ బరిలో ఉండడం వల్ల ఆయన ఆత్మీయుడు శ్రీరాములు, సొంత సోదరుడు సోమశేఖరరెడ్డి కూడా ఓడిపోయారు. తన పార్టీ గెలవలేకపోయినా, తనను అవమానించిన బీజేపీని ఓడించడంతో గాలి జనార్దన్‌రెడ్డి విజయం సాధించారు.