Covid: జాగ్రత్త పడకుంటే అంతే.... భారీగా పెరుగుతున్న కరోనా మరణాలు
ఆదివారం ఒక్క రోజే 14 మంది వైరస్ కారణంగా మృత్యువాతపడ్డారు. ఈ మేరకు సోమవారం కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో....
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 44,196,318కు చేరింది. మరణాల సంఖ్య 53,09,79కు చేరింది. మరణాలు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ముందు వరుసలో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 35,199 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.74, మరణాల రేటు 1.19గా ఉంది.
చదవండి: ఇకపై వాట్సాప్‌లో సచివాలయాల సేవలు... ఏపీలో మరో విప్లవాత్మక నిర్ణయం
ఎయిర్‌పోర్టుల్లో టెస్ట్‌లు..!
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు తప్పనిసరి చేశాయి. హర్యానా, కేరళ పుదుచ్చేరి బహరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలంటూ ఆదేశాలు జారీచేశాయి.