Economic Crisis in Sri Lanka: శ్రీలంకకు 40 వేల టన్నుల డీజిల్ సరఫరా చేసిన దేశం?
ఆర్థిక సంక్షోభం, అధిక ధరలు, కరెంటు కోతలతో అల్లాడుతున్న శ్రీలంకకు భారత్ చేయూత అందించింది. మరో 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్ సరఫరా చేసింది. ఈ ట్యాంకర్లు ఏప్రిల్ 2న శ్రీలంక చేరాయి. ఇటీవలి కాలంలో ఇది లంకకు భారత్ అందించిన నాలుగో డీజిల్ సాయం. గత 50 రోజుల్లో 2 లక్షల టన్నుల డీజిల్‌ను శ్రీలంకకు సరఫరా చేసినట్లు భారత ప్రభుత్వం తెలిపింది.
PM Modi, PM Deuba: జయనగర్–కుర్తా రైల్వే లైన్‌ను ఏ రెండు దేశాల మధ్య ప్రారంభించారు?
ఆర్థిక అత్యవసర పరిస్థితి..
ఆహార కొరత, ధరల మంటను భరించలేక శ్రీలంకలో జనం వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. 2022, ఏప్రిల్ 1 నుంచి దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
భారత గగనతలంలో పేలిపోయిన చైనా రాకెట్ పేరు?
చైనా 2021 ఫిబ్రవరిలో ప్రయోగించిన చాంగ్ జెంగ్ 5బీ రాకెట్ ఏప్రిల్ 2న భూ వాతావరణంలోకి ప్రవేశించి భారత గగనతలంలో పేలిపోయింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ దృశ్యాలు కనిపించినట్లు స్థానికులు చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదు. చైనా సొంతంగా అంతరిక్షంలో ప్రయోగశాలను నిర్మిస్తోంది. అందుకు అవసరమైన పరికరాలు, సిబ్బందిని రాకెట్లలో పంపుతోంది.
India-Russia: ప్రధాని మోదీతో రష్యా మంత్రి లావ్రోవ్ ఎక్కడ భేటీ అయ్యారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీలంకకు మరో 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్ సరఫరా చేసిన దేశం?
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : భారత్
ఎందుకు : శ్రీలంక ప్రజలు.. ఆర్థిక సంక్షోభం, అధిక ధరలు, కరెంటు కోతలతో అల్లాడుతున్నందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్