India-Vietnam Defence Policy: న్యూఢిల్లీలో జరిగిన 14వ భారత్-వియత్నాం డిఫెన్స్ పాలసీ
Sakshi Education
14వ భారత్-వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ న్యూఢిల్లీలో జరిగింది.
ఆగస్టు 1వ తేదీ జరిగిన ఈ సమావేశంలో రక్షణ కార్యదర్శి గిరిధర్ అరమనే, వియత్నాం జాతీయ రక్షణ డిప్యూటీ మంత్రి సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ హోంగ్ జువాన్ చియెన్ సహ అధ్యక్షత వహించారు. 2022 జూన్‌లో ‘2030 దిశగా భారత్-వియత్నాం రక్షణ భాగస్వామ్యంపై జాయింట్ విజన్ స్టేట్‌మెంట్’పై సంతకం చేసినప్పటి నుంచి సాధించిన పురోగతిని సమావేశం సమీక్షించింది.
ఇందులో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. కీలక చర్చల్లో సైబర్ సెక్యూరిటీ, మిలిటరీ మెడిసిన్, జలాంతర్గామి శోధన వంటి కొత్త సహకార రంగాలు ఉన్నాయి. శిక్షణా మార్పిడిని మెరుగుపరచడానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకం చేయడం జరిగింది.
Published date : 06 Aug 2024 09:53AM