Skip to main content

RRR Movie: ‘నాటు నాటు’ సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు

ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ఇప్పుడు అవార్డుల్లోనూ సత్తా చాటుతోంది.

అంతర్జాతీయ వేదికగా ఇప్పటికే ఎన్నో అవార్డులు పొందిన ఈ చిత్రం తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లోనూ మెరిసింది. 80వ గోల్డెన్ గ్లోబ్స్ (Golden Globes) హాలీవుడ్ అవార్డ్స్ సీజన్‌ కమెడియన్ జెరోడ్ కార్మిచెల్ హోస్ట్‌గా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో జ‌రుగుతోంది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు గెలుచుకోగా.. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు.
ఇక ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’’ ఉత్తమ ఆంగ్లేతర చిత్ర విభాగంలోనూ పోటీపడుతోంది. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. ‘నాటు నాటు’ పాటను చంద్రబోస్‌ రాయగా, రాహుల్‌ సిప్లిగంజ్‌, కాల భైరవ పాడారు. ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌గా పని చేశారు.  

Kantara Oscar: ఆస్కార్ రేసులో కాంతారా

Published date : 11 Jan 2023 11:33AM

Photo Stories