Padma Awards 2023: పద్మ అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
Sakshi Education
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుని ఈ ఏడాది 106 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది.
![President Droupadi Murmu presents Padma Awards 2023](/sites/default/files/images/2023/04/06/keeravani-padma-sri-award-1680777938.jpg)
ఈ అవార్డుల ప్రధానోత్సవం మార్చిలోనే జరిగింది. ఆ రోజు అవార్డు అందుకోలేకపోయిన పలువురికి రాష్ట్రపతి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏప్రిల్ 5వ తేదీ వీటిని ప్రధానం చేశారు.
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థపాకుడు, దివంగత ములాయం సింగ్ యాదవ్‌కు ప్రకటించిన పద్మ విభూషణ్‌ను ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ అందుకున్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థపాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి, చినజీయర్ స్వామి పద్మ భూషణ్ అవార్డులు అందుకున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సూపర్ 30 ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వ్యవస్థపాపకుడు ఆనంద్ కుమార్, బాలీవుడ్ నటి రవీనా టాండన్ ద్రౌపది, ఖాదర్ వలీ, నాగప్ప గణేశ్ కృష్ణరాజనాగర్, అబ్బారెడ్డి నాగేశ్వరరావు తదితరులు ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్నారు.
Published date : 06 Apr 2023 04:15PM