Skip to main content

Change Maker of the Year Award: ఆర్‌బీఐకి ఛేంజ్‌ మేకర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు

అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్‌ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు తన వంతు కృషి చేస్తున్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రతిష్టాత్మక ’ఛేంజ్‌ మేకర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ టైటిల్‌ను గెలుచుకుంది.
RBI wins Change Maker of the Year Award 2023, RBI Wins 'Change Maker of the Year' Award for Strengthening Indian Economy

ది హిందూ బిజినెస్‌లైన్‌ ఛాంజ్‌మేకర్‌ అవార్డ్‌ 2023కు సంబంధించి  గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ నేతృత్వంలోని ఆర్‌బీఐ ఈ గుర్తింపును పొందినట్లు ఒక ప్రకటన వెలువడింది. 

Sam Balsara honoured with Lifetime Achievement Award: లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ అందుకున్న‌ సామ్ బల్సారా

మొత్తం ఆరు కేటగిరీల్లో ఈ ఛేంజ్‌ మేకర్‌ అవార్టులను ప్రకటించారు. చేంజ్‌ మేకర్‌ ఆఫ్‌ ది ఇయర్‌తో పాటు ఐకానిక్‌ చేంజ్‌ మేకర్‌ ఆఫ్‌ ది ఇయర్, ఛేంజ్‌ మేకర్‌ – సోషల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్, ఛేంజ్‌ మేకర్‌ – డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్, ఛేంజ్‌ మేకర్‌ – ఫైనాన్షియల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్, యంగ్‌ ఛేంజ్‌మేకర్స్‌ అవార్డులు వీటిలో ఉన్నాయి.

డెయిరీ సంస్థ అమూల్‌కు ఐకానిక్‌ ఛేంజ్‌ మేకర్‌ గుర్తింపు లభించింది. హెర్‌కీ వ్యవస్థాపకుడు నేహా బగారియా, ఎడ్యుకేట్‌ గర్ల్స్‌ వ్యవస్థాపకురాలు సఫీనా హుస్సేన్‌కు ’ఛేంజ్‌ మేకర్‌ – సోషల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌’ అవార్డు లభించింది. స్టెలాప్స్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఛేంజ్‌మేకర్‌– డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ గుర్తింపు లభించింది. ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజన ‘ఛేంజ్‌ మేకర్‌ – ఫైనాన్షియల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌’ అవార్డు పొందింది. టెక్‌ ఎడ్యుకేషన్, మెటల్‌ హెల్త్‌ ఎవేర్‌నెస్‌లో విశేష కృషి సల్పిన శ్రీనిధి ఆర్‌ఎస్‌కు ‘యంగ్‌ ఛేంజ్‌మేకర్‌’ గుర్తింపు లభించింది.  

Shantanu Narayen Receives Osmania Doctorate: ఉస్మానియా గౌరవ డాక్టరేట్‌ను అందుకున్న శంతను నారాయణ్‌

Published date : 08 Nov 2023 01:37PM

Photo Stories