Skip to main content

Sam Balsara honoured with Lifetime Achievement Award: లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ అందుకున్న‌ సామ్ బల్సారా

అడ్వర్టైజింగ్ పరిశ్రమ అనుభవజ్ఞుడు, మాడిసన్ వరల్డ్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సామ్ బల్సారా అరుదైన ఘనతను దక్కించుకున్నారు.
Sam Balsara recognized for outstanding services in media and advertising by Exchange 4 Media Group. Award ceremony: Sam Balsara receiving the Lifetime Achievement Award in media and advertising.Exchange 4 Media Group honoring Sam Balsara for his contributions to media and advertising. Sam Balsara honoured with Lifetime Achievement Award, Sam Balsara receiving the Lifetime Achievement Award from Exchange 4 Media Group.

మీడియా ,అడ్వర్టైజింగ్  రంగంలో  చేసిన సేవలకుగానూ ఎక్స్ఛేంజ్4మీడియా గ్రూపు  ఆయనకు 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్'ని ఇచ్చి సత్కరించింది. ఎక్స్ఛేంజ్4మీడియా గ్రూప్ మీడియా ఏస్ అవార్డ్స్ 2023  వేడుకలను  ఈ నెల  (నవంబరు 2) ముంబైలో  నిర్వహించింది.  దీంతో పలువురు ఇండస్ట్రీ పెద్దలు,  ఇతర బిజినెస్‌ వర్గాలు ఆయనకు  అభినందనలు  తెలిపాయి. 

Shantanu Narayen Receives Osmania Doctorate: ఉస్మానియా గౌరవ డాక్టరేట్‌ను అందుకున్న శంతను నారాయణ్‌

ఎవరీ సామ్‌ బల్సారా

గుజరాత్‌లోని వల్సాద్ అని పిలిచే బల్సార్‌లో జన్మించారు. తండ్రి ఫారెస్ట్ కాంట్రాక్టర్ కావడంతో  బల్సారా కుటుంబం బెంగళూరుకు మారింది. బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుండి డిగ్రీని, 1970లో ముంబైలోని జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుంచి ఎంబీఏ  పూర్తి చేశారు. ఆ తరువాత క్యాడ్‌బరీకి, అడ్వర్టైజింగ్ ఎట్ కాంట్రాక్ట్ (WPP)  ముద్రకు లాంటి సంస్థలకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. సారాభాయ్‌లో తన కరియర్‌ను ప్రారంభించిన బల్సారా మార్కెటింగ్‌ రంగంలో 50ఏళ్ల అనుభవజ్ఞుడు. 

Global Leadership Award 2023: గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు 2023 అందుకున్న నీతాఅంబానీ

Published date : 07 Nov 2023 09:40AM

Photo Stories