Global Leadership Award 2023: గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు 2023 అందుకున్న నీతాఅంబానీ
Sakshi Education
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ 2023 సంవత్సరానికి గాను దాతృత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డును అందుకున్నారు.
ఈ విషయాన్ని యూఎస్-ఇండియా ఎస్‌పీఎఫ్ తన ఎక్స్ ఖాతాలో తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ మహిళాసాధికారత, పిల్లల విద్య, భారతీయ కళలు, క్రీడలను ప్రోత్సహించినందుకు ఈ అవార్డు ప్రదానం చేసినట్లు యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ పేర్కొంది.
BHEL appoints Murthy as Next CMD: బీహెచ్‌ఈఎల్ సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి
అవార్డు తీసుకున్న సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ..రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే దాదాపు 7 కోట్ల ప్రజలకు సేవ చేశామన్నారు. సీఎస్‌ఆర్ ప్రవేశపెట్టక ముందే రిలయన్స్ సొంతంగా ‘కార్పొరేట్ మోరల్ రెస్పాన్స్‌బిలిటీ’ ద్వారా సేవలందించినట్లు చెప్పారు.
Ecuador New president: ఈక్వెడార్ అధ్యక్షుడిగా డేనియెల్ నొబోవా
Published date : 31 Oct 2023 04:26PM