National Teachers Award: 44 మందికి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డుల ప్రదానం
విద్యార్థుల్లో దాగి ఉండే స్వాభావిక ప్రతిభను వెలికితీయడం తమ ప్రాథమిక బాధ్యతగా ఉపాధ్యాయులు పనిచేయాలని కోవింద్ ఆకాంక్షించారు. దేశాభివృద్ధిలో ఉపాధ్యాయుడి పాత్ర కీలకంగా ఉంటుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి...
రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి నలుగురు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్నారు. వారిలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కెరమెరి మండలం సవర్‌ఖేడా ఎంపీపీఎస్ తాత్కాలిక ప్రధాన ఉపాధ్యాయుడు రంగయ్య కడెర్ల, సిద్దిపేటలోని ఇందిరానగర్ జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు పయ్యావుల రామస్వామి, విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరం జిల్లా పరిషత్ హైస్కూలు ఉపాధ్యాయుడు కొణతాల ఫణి భూషణ్, చిత్తూరు జిల్లా ఎం.పైపల్లి ఈరాల జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఎస్.మునిరెడ్డి ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వర్చువల్ విధానం ద్వారా 44 మందికి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డుల ప్రదానం
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎందుకు : విద్యారంగంలో విశేష ప్రతిభ కనబరిచినందుకు...