Britain: నైట్‌హుడ్ హోదా పొందిన మాజీ ప్రధాన మంత్రి?
బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్‌ను బ్రిటన్ రాణి ఎలిజబెత్ నైట్‌హుడ్ హోదాతో సత్కరించారు. ఇకపై బ్లెయిర్.. ‘ఆర్డర్ ఆఫ్ గార్డర్’ సభ్యునిగా కొనసాగుతారు. అవిశ్రాంతంగా ప్రజాసేవ చేసిన వారిని బ్రిటిష్ ప్రభుత్వం 1348వ సంవత్సరం నుంచి ఇలా నైట్‌హుడ్ హోదాతో గౌరవిస్తోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సలహాతో సంబంధం లేకుండానే రాణి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై టోనీ బ్లెయిర్‌ను ‘సర్ టోనీ’ అని గౌరవంగా సంబోధిస్తారు. 68 ఏళ్ల టోనీ బ్లెయిర్ 1997 నుంచి పదేళ్లపాటు బ్రిటన్‌కు ప్రధానిగా సేవలందించారు.
బ్రిటన్ మాజీ మంత్రి, నల్ల జాతీయురాలు బరోనెస్ వలేరీ అమోస్(67)కు సైతం నైట్‌హుడ్ హోదా దక్కింది. గృహ హింస, లైంగిక వేధింపులపై అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలతో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్న తన కోడలు కమిల్లాను ‘రాయల్ కంప్యానియన్’గా నియమిస్తూ ఎలిజబెత్ రాణి మరో నిర్ణయం తీసుకున్నారు.
చదవండి: కువెంపు జాతీయ అవార్డుకు ఎంపికైన రచయిత్రి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : నైట్‌హుడ్ హోదా పొందిన బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి?
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : టోనీ బ్లెయిర్
ఎందుకు : అవిశ్రాంతంగా ప్రజాసేవ చేసినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్