Skip to main content

Telugu Writer: కువెంపు జాతీయ అవార్డుకు ఎంపికైన రచయిత్రి?

Writer Satyavathi

ప్రతిష్టాత్మకమైన ‘కువెంపు జాతీయ అవార్డు–2021’కు ప్రఖ్యాత తెలుగు కథారచయిత్రి పి.సత్యవతి ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద రూ.5 లక్షల నగదు, రజత పతకాన్ని అందుకోనున్నారు. కథలు, నవలలు, అనువాదాలతోసహా అనేక రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినందుకుగాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. 2021, డిసెంబర్‌ 29న ప్రముఖ కన్నడ కవి కువెంపు పుట్టిన రోజున కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకా కుప్పలిలో సత్యవతికి అవార్డు ప్రదానం చేయనున్నారు. కన్నడ కవి కువెంపు అసలు పేరు కుప్పలి వెంకటప్ప పుట్టప్ప(కువెంపు అనేది ఆయన కలం పేరు).

స్త్రీవాద రచయిత్రిగా..

1940లో గుంటూరు జిల్లా కొలకలూరులో జన్మించిన పి.సత్యవతి... విజయవాడలోని ఎస్‌ఏఎస్‌ కళా శాలలో ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. వందల కొద్దీ కథలు, 5 నవలలు రాశారు. దేశంలోనే ప్రముఖ స్త్రీవాద రచయిత్రిగా గుర్తింపు పొందారు. ఆరు దశాబ్దాలకుపైగా వివిధ మాధ్యమాల ద్వారా తన కథలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.
చ‌ద‌వండి: గోల్డెన్‌ పీకాక్‌ ఎకో ఇన్నోవేషన్‌–2021 అవార్డు విజేత?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రతిష్టాత్మకమైన ‘కువెంపు జాతీయ అవార్డు–2021’కు ఎంపికైన రచయిత్రి?
ఎప్పుడు  : డిసెంబర్‌ 13
ఎవరు : ప్రఖ్యాత తెలుగు కథారచయిత్రి పి.సత్యవతి
ఎందుకు  : కథలు, నవలలు, అనువాదాలతోసహా అనేక రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినందుకుగాను..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 14 Dec 2021 06:01PM

Photo Stories